breaking news
rtc elployees
-
ఆర్టీసీ కార్మికులకు భద్రత ఏది?: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఎన్నికలలో గెలిచిన యూ నియన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుండటంతో కార్మికుల ప్రయోజనాలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆర్టీసీకి చెందిన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త వేతన సవరణ ప్రకటన ఇంతవరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీ సీని గట్టెక్కించేందుకు రూ.670 కోట్లు ఇస్తామని చెప్పి రూ.260 కోట్లే విడుదల చేశారన్నారు. ఏఐటీయూసీ నేత అబ్రహం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అడగకుండానే జీతాలు పెంచుతామని సీఎం చెప్పారని, కానీ ఇంతవరకు అమలు కాలేదని, సకల జనుల సమ్మెకు సంబంధించి వేతనంతో కూడిన సెలవుల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు: నగేశ్ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రకటన తర్వాత టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఈ యాత్రలో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, బస్సు యాత్ర తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్ వ్యాఖ్యానించారు. -
నగరంలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు..
హైదరాబాద్ : వేతన సవరణ (పీఆర్సీ) ప్రధాన డిమాండ్‌గా గురువారం ఆర్టీసీ బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నగరంలో పలు చోట్ల బస్సులు నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ డిపోలో దాదాపు 150 బస్సులు నిలిపివేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ లో పలు ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. వేతన సవరణ డిమాండ్ల నేపథ్యంలో బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రయివేటు వాహనదారులు సందడిలో సడేమియాలాగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.