breaking news
RTC Association
-
ఆర్టీసీకి అండగా నిలుస్తాం..
కడప మేయర్ సురేష్‌బాబు కడప అర్బన్ : ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, కార్మికుల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప మేయర్ కె.సురేష్‌బాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకుని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11 నుంచి ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మె నేపథ్యంలో కడపలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనలో భాగంగా వేల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీ విభాగాన్ని తెలంగాణలో ఉండేలా, కేవలం 10 శాతం ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండేలా విభజన ప్రక్రియ జరగడంతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కార్మికులు తమ వేతనాల్లో కొంత భాగాన్ని సొసైటీలో దాచుకుంటే ఆ మొత్తాన్ని కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం యాజమాన్యం వాడుకోవడాన్ని తప్పుబట్టారు. ఆర్టీసీకి రోజూ రూ.2.50 కోట్లు నష్టం వాటిల్లుతోందని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అయినా ప్రజలకు సేవలందించడంలో ఏమాత్రం తగ్గడం లేదని చెప్పారు. అలాంటి ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ సమ్మెకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది అజయ్‌కుమార్ వీణా, ఈయూ చీఫ్ డిప్యూటీ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి, ఎల్ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు శేఖర్, బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు శేషయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కార్యదర్శి నరసయ్య, రీజనల్ అధ్యక్షుడు నాగముని, రీజనల్ నాయకులు చెన్నయ్య, శేఖర్, కడప డిపో అధ్యక్ష కార్యదర్శులు మూర్తి, ప్రకాశం, నాగసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ఖతర్నాక్ కండక్టర్లు
గద్వాల టౌన్, న్యూస్‌లైన్: నిన్న కల్వకుర్తి డిపోలో, నేడు గద్వాల ఆర్టీసీ డిపోలో..ఇలా రోజుకోచోట నకిలీ కండక్టర్ల ఉదంతం వెలుగుచూస్తూనే ఉంది. ప్రతిభావంతుల పొట్టకొట్టి.. అధికారులను బురిడీ కొట్టించి.. ప్ర భుత్వాన్ని పక్కదారి పట్టించిన ఈ నకిలీ వీరులు జిల్లాలో ఇం కెంతమంది ఉన్నారోనని ఆర్టీసీ అధికారులు వెతికేపనిలో ప డ్డారు. ఈ నేపథ్యంలో గద్వాల ఆర్టీసీ డిపోకు నకిలీ కండక్టర్ల బెడద వణికిస్తోంది. బోగస్ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు పొందిన కండక్టర్లపై ఆర్టీసీ సంస్థ కఠినంగా వ్యవహరించింది. అలా ఉద్యోగాలు పొందిన వారిలో గద్వాల డిపోకు చెందిన 9 కండక్టర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇక్కడ మరికొంతమంది కండక్టర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. మహబుబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో కాం ట్రాక్టు పద్ధతిన 2009లో కండక్టర్ల నియామకం చేపట్టారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కండక్టర్లు ఉద్యోగం సాధించారు. అలా నియామకమైన వారిని 2012లో ఆర్టీసీ యాజమాన్యం రెగ్యులర్ చేసింది. రెగ్యులర్ అయిన తరువాత ఉద్యోగులపై ఆర్టీసీ విజిలెన్స్‌శాఖ విచారణ మొదలుపెట్టింది. అందులో కొంతమంది సమర్పించిన ఎస్ఎస్సీ సర్టిఫికేట్లపై విజిలెన్స్ అధికారులకు అనుమానాలు వచ్చాయి. దీంతో వెంటనే వారు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్‌శాఖ రహస్యంగా విచారణ చేపట్టింది. ఉద్యోగ నియామక సమయంలో అభ్యర్థులు సమర్పించిన మార్కుల మెమోలోని హల్‌టికెట్ నంబర్ ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు వెళ్లి అధికారులు ఆరాతీశారు. అక్కడ బోగస్ వ్యవహారం బట్టబయలైంది. ఎస్ఎస్సీ బోర్డు ద్వారా మంజూరైన మార్కుల మెమోకు, అభ్యర్థులు సమర్పించిన మెమోకు ఎక్కడా పొంతనలేదు. దీంతో మె మోలో మార్కులను టాంపరింగ్ చేసినట్లు గుర్తించారు. మార్కులను టాంపిరింగ్ చేసి అధిక మార్కులుగా నమోదు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇలా బోగస్ సర్టిఫికేట్లు సమర్పించి 9 మంది కండక్టర్లుగా ఉద్యోగాలు పొందినట్లు విజిలెన్స్ శాఖ గుర్తించింది. సుమారు ఆరు నెలలపాటు వి చారణ సాగింది. అక్రమమార్గంలో కండక్టర్ ఉద్యోగాలు పొందిన 9 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఆర్టీసీ యా జమాన్యం రెండు రోజుల క్రితం గద్వాల డిపోకు ఆదేశాలు జారీచేసింది. వీరిలో విజయ భాస్కర్, రాములు, చంద్రశేఖ ర్, రామకృష్ణ, రవికుమార్, మన్యంకొండ, జానకి, వెంకటేశ్వర్‌రెడ్డి, భోజరాజులు ఉన్నారు. వారిని విధుల నుంచి తొలగించినట్లు డిపో మేనేజర్ భీంరెడ్డి తెలిపారు. ఆ 14 మంది ఎవరు? బోగస్ సర్టిఫికేట్లతో కండక్టర్ ఉద్యోగాలు పొంది విధుల నుంచి తొలగించబడిన అభ్యర్థులు విచారణ సమయంలో విజిలెన్స్ అధికారులకు కళ్లుతిరిగే వాస్తవాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. 2009 కంటే ముందు నియమితులైన వారిలో సైతం చాలామంది కండక్టర్లు తమలాగే ఉద్యోగాలు పొందారని వెల్లడించినట్లు సమాచారం. వారు చూపిన మార్గాన్ని తాము అనుసరించి బోగస్ సర్టిఫికేట్లు సంపాదించామన్నారు. వారిని వదిలి తమను మాత్రమే విధుల నుంచి తొలగిస్తే ఎలాగని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇంకా గద్వాల డిపోలో 14 మంది నకిలీ కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని, వారిలో సైతం విజిలెన్స్ గుబులు పుట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డిపోలో ఆ 14 మంది కండక్టర్లు ఎవరనేదానిపై కార్మికులల్లో చర్చ సాగుతోంది. ఆర్టీసీలో 2009కు ముందు జరిగిన నియామకాలతో పాటు ఇతర శాఖల్లో సైతం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బోగస్ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని ఒక ఆర్టీసీలోనే 200 మందికి పైగా కండక్టర్లు బోగస్ సర్టిఫికేట్లతో అక్రమమార్గంలో ఉద్యోగాలు పొందినట్లు తెలిసింది. మార్కుల టాంపరింగ్ చేసిందెవరు? ఎస్ఎస్సీ మెమోలో టాంపరింగ్ ద్వారా అధిక మార్కులు నమోదు చేసిన అక్రమార్కులను గుర్తించే పనిలో విజిలెన్స్ అధికారులు ఉన్నారు. వనపర్తి మండలం కడుకుంట్ల చెందిన ఓ దళారీ ద్వారా టాంపరింగ్ చేసిన సర్టిఫికేట్లు వస్తున్నాయి. విధుల నుంచి తొలగించిన కండక్టర్లు సైతం ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇలా మార్కులను టాంపరింగ్ చేసిన సర్టిఫికేట్లతో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు సమాచారం. వనపర్తి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన చాలా మంది నుంచి పెద్ద మొత్తంలో ఈ దళారీ డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అక్రమమార్గంలో ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కొరుతున్నారు. బాధ్యులపై చర్యలు జిల్లా 47మంది నకిలీ సర్టిఫికేట్లు సమర్పించి కండక్టర్ ఉద్యోగాలు పొందినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ మేరకు ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ఎస్ఎస్సీ బోర్డుకు వెళ్లి ఆయా వ్యక్తులు సమర్పించిన సర్టిఫికేట్లపై విచారణ చేపట్టారు. ఈ విచారణ కూడా దాదాపు పూర్తయింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. - గంగాధర్, ఆర్టీసీ ఆర్ఎం, మహబూబ్‌నగర్