సచిన్ చివరి టెస్టు జెర్సీకి రూ.6 లక్షలు
జోధ్‌పూర్: సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో చివరిసారిగా ధరించిన టెస్టు జెర్సీకి వేలంలో రూ.6 లక్షల ధర పలికింది. స్థానిక ఉమేధ్ భవన్లో నిర్వహించిన ఈ వేలంలో జోధ్‌పూర్ యువరాజు శివ్‌రాజ్‌సింగ్ ఈ జెర్సీని సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఇతర వస్తువుల కోసం జరిగిన వేలంలో దాదాపు రూ.80 లక్షలు సమకూరగా వీటిని ఇండియన్ హెడ్ ఇంజ్యూరీ ఫౌండేషన్ (ఐహెచ్ఐఎఫ్)కు అందించనున్నారు.