breaking news
RS. 1 crore
-
తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం
తిరుమల : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు రూ. కోటి విరాళం అందజేశారు. విశాఖపట్నంకు చెందిన శ్రీమిత్రా ఇన్ఫ్రా అధినేత పి.శ్రీనివాసరావు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని శుక్రవారం ఉదయం తిరుమలలో కలిశారు. అనంతరం ఆయనకు చెక్కును అందజేశారు. ఈ మొత్తాన్ని నిత్యాన్నదానం ట్రస్టు కింద జమ చేయాలని కృష్ణమూర్తిని పి. శ్రీనివాసరావు కోరారు. ఆ తర్వాత పి.శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
రూ.కోటి నకిలీ నోట్లు ఎక్కడివి...?
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ నాయకులు చెలామణి చేసిన రూ.కోటి నకిలీ కరెన్సీ రాకెట్ హైదరాబాద్‌ను తాకింది. ఏపీ ప్రభుత్వ విప్ రవికుమార్‌కు ప్రధాన అనుచరులుగా చెలామణి అవుతున్న గోనెపాడు ఉపసర్పంచ్ మామిడి తిరుపతిరావు, కీలక సూత్రధారిగా గుడివలసకు చెందిన నడికుర్తి వసంతరావు, అన్నెవరపు ఈశ్వర్రావు, కవిటినాయుడు, లక్ష్మణ్‌రావులు హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కొనసాగిస్తున్న నకిలీ కరెన్సీ రాకెట్‌ను ఇక్కడి పోలీసులు పసిగట్టి, శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం వసంతరావు బృందాన్ని శ్రీకాకుళం జిల్లా పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చి నకిలీ కరెన్సీ వ్యవహారానికి సంబంధించిన వివరాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ గ్యాంగ్‌లో అన్నెపు ఈశ్వర్రావు బాలానగర్ ప్రాంతంలోనే చాలాకాలంగా నివసిస్తుండటంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
రాజంపేటలో ఎర్రచందనం స్వాధీనం