breaking news
RP Marathe
-
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తొలగింపు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) తాజాగా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పి.మరాఠే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.కె.గుప్తాలను పదవుల నుంచి తొలగించింది. బ్యాంక్ బోర్డు డైరెక్టర్లు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.సి.రౌత్.. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని బ్యాంక్ పేర్కొంది. పుణే పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మరాఠే, గుప్తాలను రూ.2,043 కోట్ల స్కామ్‌కు సంబంధించి చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు బెయిల్ మీద బయటకు వచ్చారు. -
ఈ-లాబీతో మెరుగైన సేవలు
హైదరాబాద్: ఖాతాదారుల సౌకర్యార్థం ఈ-లాబీ సేవలను బ్యాంక్ ఆఫ్ బరోడా అందుబాటులోకి తెస్తోందని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జోనల్ జనరల్ మేనేజర్ ఆర్పీ మరాఠే చెప్పారు. శనివారం నల్లకుంట శివం రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏర్పాటు చేసిన ఈ-లాబీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఖాతాదారుల సమావేశంలో మాట్లాడుతూ 24 గంటలూ మెరుగైన సేవలు అందించేందుకు మొదటగా ఈ-లాబీని హైదరాబాద్ నగరంలో ప్రారంభించామన్నారు. ఇందులో చెక్ డిపాజిట్ మెషిన్, సెల్ఫ్ సర్వీస్ పాస్ బుక్ ప్రింటర్, బల్క్ నోట్ యాక్సెప్టెన్సీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ఉన్నాయని వివరించారు. వీటిలో మొదటి నాలుగు మిషన్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుల కోసమేనని చెప్పారు. త్వరలో తెలంగాణలో మరో ఏడు, ఆంధ్రలో మూడు ఈ-లాబీలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్, ఎండీ ఎస్ఎస్.ముంద్ర, డిప్యూటీ జీఎం పి.నర్సింహారావు, చీఫ్ మేనేజర్ పీఎస్ఎన్.మూర్తి, ఏపీ రీజియన్ ఏజీఎం మురళీ క్రిష్ణ పాల్గొన్నారు.