breaking news
roudy sheeters
-
కళ్లు పీకేస్తా జాగ్రత్త!
సాక్షి, బెంగళూరు : లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన కఠినంగా అణచివేస్తామని నేర విభాగం అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ రౌడీలను హెచ్చరించారు. పోలీసులు నిన్న (శుక్రవారం సాయంత్రం) 250 మందితో పరేడ్ నిర్వహించి తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లు కుణిగల్‌గిరి, సైలెంట్ సునీల్, శివాజీనగర తన్వీర్‌తో పాటు 250 మందికిపైగా రౌడీలను వరుసగా నిలబెట్టి అలోక్ కుమార్ హెచ్చరించారు. ఇదే సమయంలో రౌడీషీటర్ సైలెంట్ సునీల్ వద్దకు రాగానే ‘ఏంటి అలా చూస్తున్నావ్ కళ్లు పీకేస్తా అంటూ కొట్టడానికి చెయ్యి పైకెత్తారు. చెవి పిండుతూ సక్రమంగా నిలబటం నేర్చుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులతో ఇతనిపై నిరంతరం నిఘా పెట్టండి అంటూ ఆదేశించారు. అనంతరం కుణిగల్ గిరిని ప్రశ్నించిన అలోక్‌కుమార్ ఐపీఎల్ బెట్టింగ్ ఎంత డబ్బు గెలిచావు బెట్టింగ్ పెడతావా అని ప్రశ్నించారు. మొదట బెట్టింగ్ ఆడలేదని వాదించిన కుణిగల్ గిరి చివరికి బెట్టింగ్ ఆడుతున్నట్లు ఒప్పుకుని రూ.2 లక్షల వరకు గెలిచినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. రౌడీల పరేడ్ ముగిసిన అనంతరం రౌడీషీటర్లు సీసీబీ కార్యాలయం నుంచి వెళ్లినప్పటికీ సైలెంట్ సునీల్‌ను పోలీస్ అధికారులు రాత్రి 10 గంటల వరకు విచారణ చేపట్టారు. జుట్టు కత్తిరించుకుని వాట్సాప్‌లో ఫోటోలు పెట్టాలి గుబురుగడ్డం, భారీ జులపాలతో ఉన్న కొందరు రౌడీలను హెచ్చరించిన అలోక్‌కుమార్ వెంటనే జట్టు కత్తిరించుకుని పోలీసులకు వాట్సాప్‌లో ఫొటోలు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలని ఆదేశించారు. -
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
రాయదుర్గం అర్బన్ : శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చలపతిరావు రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం రాత్రి రాయదుర్గం పోలిస్‌స్టేషన్ పరిధిలోని 26 మంది రౌడీషీటర్లకు, చెడు ప్రవర్తన కల్గిన వారిని ఎస్ఐ మహానంది స్టేషన్‌కు పిలిపించారు. ఈసందర్భంగా వారికి సీఐ చలపతిరావు కౌన్సిలింగ్ నిర్వహించారు. గతంలో ఏమి చేశారో తెలియదని, ఇక నుంచి సత్ప్రవర్తన కల్గి ఉండాలని హెచ్చరించారు. ఆసాంఘిక కార్యక్రమాల్లో గాని, శాంతిభద్రతలకు గాని భంగం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.