breaking news
roudisheeter
-
రౌడీ షీటర్ కిరాతకం: కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్య
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దారుణం చోటు చేసుకుంది. బెయిల్‌పై విడుదలైన ఓ రౌడీ షీటర్.. సూరజ్‌పూర్ జిల్లాలోని మార్కెట్ ఏరియాలో ఓ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలోకి చొరబడ్డాడు. హెడ కానిస్టేబుల్ భార్య, మైనర్ కుమార్తెను హత్యచేశారు. సూరజ్‌పూర్ ఎస్పీ ఎంఆర్ అహిరే తెలిపిన వివారాల ప్రకారం.. ‘‘హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడైన హిస్టరీ-షీటర్ కుల్దీప్ సాహు. ఆదివారం సాయంత్రం మార్కెట్ ప్రాంతంలో కానిస్టేబుల్ ఘన్‌శ్యాం సోన్వానీతో వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా ఆ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశాడు. సోన్వానీకి కాలిన గాయాలయ్యాయి. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. తర్వాత నిందితుడు దుర్గా ఊరేగింపులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆయన మైనర్ కుమార్తె , భార్యను హత్య చేశాడు. షేక్ తన ఇంటికి అర్థరాత్రి చేరుకొని చూడగా.. ఇంట్లో దోపిడి జరిగినట్లు, భార్య, కుమార్తె మృతి చెంది కనిపించారు. దీంతో తాలిబ్ పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం ఉదయం పిధా గ్రామంలో పోలీసులు మహిళ హెడ్ కానిస్టేబుల్ కుమార్తె, భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు’’ అని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. సూరజ్‌పూర్ పట్టణంలోని హెడ్ కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్యలను నిరసిస్తూ నిందితుడు సాహు నివాసం, బయట ఉన్న వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టారు. ఈ హత్య ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. -
బయటకొస్తున్న నయీమ్ దందాలు
నలుగురిని అదుపులోకి తీసుకున్న సిట్ వందల ఎకరాల్లో భూ దందాలు కరీంనగర్ క్రైం : నయీమ్ దందాలు జిల్లాలో తవ్వుతున్న కొద్దీ బయటకొస్తున్నాయి. ఇప్పటికే రూ.4 కోట్ల విలువ చేసే రెండెకరాల భూమికి సంబంధించిన పత్రాలు వెలుగుచూశాయి. తాజాగా ఓ మాజీ సర్పంచ్ పాత్రపై అనుమానం రావడంతో పోలీసుల విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నయీమ్ అనుచరులుగా పేర్కొంటూ జిల్లాలో చాలామంది సెటిల్మెంట్లు చేసి ఎకరాలకొద్దీ భూములను చౌకగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్, గోదావరిఖని, కోరుట్ల, జగిత్యాల, రామగుండం వంటి ప్రాంతాల్లో సివిల్ సెటిల్మెంట్లతోపాటు పలువురి బెదిరించి పెద్ద మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. సుమారు 10 నుంచి 15 మంది వరకు నయీమ్ అనుచరుల పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాల్లో భూములు కొనుగోలు, అమ్మకాలు చేశారని, వీరు అనతికాలంలోనే ధనవంతులగా మారారని ప్రచారం జరుగుతోంది. సంబంధిత వ్యక్తుల ఫోన్లు మూడురోజులుగా స్విచ్ఛాఫ్ రావడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. సిట్ అదుపులోకి నలుగురు..? నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయని అనుమానమున్న కరీంనగర్, తిమ్మాపూర్ మండలాలకు చెందిన నలుగురిని సిట్ అదుపులోకి తీసుకుందని, వీరిలో ఇద్దరు నయీమ్ సామాజిక వర్గానికి చెందినవారని సమాచారం. వారిని విచారించగా.. కరీంనగర్, తిమ్మాపూర్ మండలాల్లో మరో 10 మంది వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో రియల్టర్‌గా అవతారమెత్తి పలు భూములు అమ్మకాలు, కొనుగోలు చేశాడని, వీటిలో చాలావరకూ నయీం పేరునే వాడుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే నÄæూమ్ ఎన్కౌంటర్ తర్వాత సదరు వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, అతడి సెల్‌ఫోన్‌ను మిత్రుల వద్ద ఉంచి వెళ్లాడని తెలిసింది. బయ్యపు సమ్మిరెడ్డి ద్వారా.. బయ్యపు సమ్మిరెడ్డి పోలీసులకు లొంగిపోయిన తర్వాత నÄæూమ్ ప్రధానఅనుచరుడిగా మారాడు. తెలంగాణలోనే కీలకమైన కరీంనగర్లో నమ్మకమైన బినామీ కోసం నయీమ్ వెతుకుతున్న క్రమంలో ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని సమ్మిరెడ్డి పరిచయం చేయించాడు. అప్పటినుంచి సదరు వ్యక్తి నÄæూమ్ ముఖ్య అనుచరుడిగా మారి పలు భూ దందాల్లో సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం. సుమారు 16 ఏళ్లపాటు వీరి పరిచయం కొనసాగింది. ఈ క్రమంలో నగరానికి చెందిన పలువురి సమాచారాన్ని నÄæూమ్‌కు ఇచ్చేవాడని సమాచారం. ఒకదశలో సమ్మిరెడ్డి కూడా నÄæూమ్ను కలవాలంటే సదరు వ్యక్తి అనుమతి తీసుకునే స్థాయికి చేరిందని ప్రచారం జరుగుతోంది.