Roslin
-
‘రోస్లిన్’ రివ్యూ : ఊహించని సీన్లు, ఊహకందని ట్విస్టులు
మనిషికి నిద్ర అనేది శారీరక, మానసిక అవసరం. కాని మనకు వచ్చే కలలు కునుకు రానీయకుండా చేస్తే...కళ్ళు మూస్తే కలలో కదలాడే పాత్రలు కళ్ళెదుట నిలుస్తే, అమ్మో ఇంకేముంది..అనుకుంటాం. సరిగ్గా ఇదే నేపధ్యంలో అల్లుకుని రాసుకున్న కథే రోస్లిన్. వాస్తవానికి, అవాస్తవానికి అక్షరం తేడా ఉంటుంది, కాని ఆ తేడాలోనే కొన్ని జీవితరాతలు తలక్రిందులవుతాయి. అదే విషయాన్ని ఈ సిరీస్ మొత్తం అయ్యాక ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. మొత్తం 6 భాగాలతో స్ట్రీమ్ అవుతున్న ఈ మళయాళ సిరీస్ హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ లభ్యమవుతుంది. నాటి ప్రముఖ నటీనటులైన మీనా, వినీత్ ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు. రోస్లిన్ ఓ సైకలాజికల్ త్రిల్లర్. ముందు రెండు భాగాలు కొంచం సాగదీత అనిపించినా తరువాతి నాలుగు భాగాలు మాత్రం గుండె దడపుట్టిస్తాయి. మరీ సిరీస్ చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల మతి పోగొడతాయి. అంతలా ఈ సిరీస్ లో ఏముందో ఓ సారి చూద్దాం. ఈ సిరీస్ మొత్తం రోస్లిన్ అనే అమ్మాయి చూట్టూనే కథ తిరుగుతుంది. జాన్, శోభాల ఒక్కగానొక్క కూతరు రోస్లిన్. తను ఓ టీనేజ్ అమ్మాయి. రోస్లిన్ సమస్యేంటంటే తనకు ఎక్కువగా నిద్ర పట్టదు. ఎందుకంటే తన కలలో ఓ వ్యక్తి తనను చంపడానికి వస్తూ ఉంటాడు. దాదాపు ప్రతి రోజూ అదే కల వస్తూ ఉంటుంది. ఆ మనిషిని తలుచుకున్నప్పుడల్లా భయంతో ఒణికి పోతుంటుంది రోస్లిన్. ఇంతలో తన తల్లి స్నేహితురాలు అడగడం ద్వారా కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండడానికి జెర్రీ అనే వ్యక్తి వస్తాడు. రోస్లిన్ జెర్రీని చూసి నిలువెల్లా ఒణికిపోయి స్పృహ తప్పిపోతుంది. ఎందుకంటే రోస్లిన్ కలలో తరచుగా కనిపించే వ్యక్తి జెర్రీయే. దీంతో రోస్లిన్ జెర్రీని తన ఇంట్లో నుండి పంపాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. మరి రోస్లిన్ జెర్రీని ఇంట్లోనుండి తరిమేస్తుందా, అసలు కలలో వచ్చే వ్యక్తికి జెర్రీకి సంబంధం ఏమిటి... ఈ వివరాలన్నీ తెలియాలంటే రోస్లిన్ సిరీస్ చూడాల్సిందే. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఇదో అద్భుతమైన సిరీస్. ఊహకందని ట్విస్టులతో ఊహించని సన్నివేశాలతో ప్రేక్షకుడిని ఊగిసలాడిస్తుంది ఈ రోస్లిన్. కాకపోతే ఈ సిరీస్ చూశాక కలలు అంటే కొంత కలవరపడతారేమో. వర్త్ టు వాచ్ ఫర్ ది వీకెండ్. -
ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
2026 మొన్నే వచ్చినట్లుంది. కానీ అప్పుడే ఫిబ్రవరి చివరకొచ్చేసింది. ఈ వారం థియేటర్లలోకి శ్రీ విష్ణు నుంచి 'విష్ణు విన్యాసం' అనే కామెడీ సినిమా రానుంది. అలానే కమెడియన్ మహేశ్ విట్టా 'ఉత్తుత్త హీరోలు', 'సన్నాఫ్' చిత్రాలు రిలీజ్ కానున్నాయి. హిందీలో 'ద కేరళ స్టోరీ 2' ఈ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గ చిత్రాలే ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే.. నవీన్ చంద్ర 'హనీ', 'అక్యూజ్డ్' అనే డబ్బింగ్ మూవీతో పాటు డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. అలానే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఇదే వీకెండ్ రిలీజయ్యే అవకాశముంది. ఇవి కాకుండా ఏమైనా సర్ప్రైజు స్ట్రీమింగ్స్ ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వస్తుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు)నెట్ఫ్లిక్స్అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 27అమెజాన్ ప్రైమ్ద సీఈఓ క్లబ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23పాల్ మెక్కర్ట్నే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 25ద బ్లఫ్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 25ఇక్కీస్ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 26హాట్స్టార్ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 23వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26సంగ్ మర్మర్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 26రోస్లిన్ (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 28బుగోనియా (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28జీ5డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు సిరీస్) - ఫిబ్రవరి 27తడయమ్ (తమిళ సిరీస్) - ఫిబ్రవరి 27క్రాంతి జ్యోతి విద్యాలయ్ (మరాఠీ సినిమా) - ఫిబ్రవరి 27అంధా ప్యార్ 2.0 (హిందీ రియాలిటీ షో) - ఫిబ్రవరి 28ఆహాసర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలటీ షో) - ఫిబ్రవరి 27సన్ నెక్స్ట్హనీ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 27నీలి హక్కీ (కన్నడ మూవీ) - ఫిబ్రవరి 27ఎమ్ఎక్స్ ప్లేయర్సైకో సయ్యాన్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 25ఆపిల్ టీవీ ప్లస్మోనార్క్: లెగసీ ఆఫ్ మానస్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 27(ఇదీ చదవండి: 'రంగస్థలం' సినిమా.. కనీసం రాష్ట్ర అవార్డ్ కూడా ఇవ్వలేదు)


