breaking news
Rodri
-
ఫుట్‌బాల్ చరిత్రలో మరో భారీ డీల్
ఫుట్‌బాల్ చరిత్రలో మరో భారీ బదిలీకి రంగం సిద్ధమైంది. స్పెయిన్ కెప్టెన్, 2024 బాలన్ డి’ఓర్ విజేత రోడ్రీని మాంచెస్టర్ సిటీ నుంచి బార్సిలోనా కొనుగోలు చేయనుంది. సుమారు 65 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.760 కోట్ల) ఇరు క్లబ్‌ల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.30 ఏళ్ల రోడ్రీ బార్సిలోనాతో నాలుగేళ్ల ఒప్పందం చేసుకోనున్నాడు. రానున్న రోజుల్లో బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.సిటీతో రోడ్రీ ప్రయాణానికి ముగింపు2019లో అట్లెటికో మాడ్రిడ్ నుంచి మాంచెస్టర్ సిటీలో చేరిన రోడ్రీ.. ఏడు సీజన్లలో క్లబ్ తరఫున 298 మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో 12 ప్రధాన టైటిళ్లు గెలిచాడు.అతని ఖాతాలో నాలుగు ప్రీమియర్ లీగ్ టైటిళ్లు, రెండు ఎఫ్ఏ కప్‌లు, మూడు ఈఎఫ్ఎల్ కప్‌లు, ఒక ఛాంపియన్స్ లీగ్ టైటిల్ ఉన్నాయి.2024-25 సీజన్లో తీవ్రమైన మోకాలి గాయం కారణంగా రోడ్రీ ఎక్కువ కాలం ఆటకు దూరమయ్యాడు. గత సీజన్లో హ్యామ్‌స్ట్రింగ్ సమస్య కూడా అతడిని ఇబ్బంది పెట్టింది.అయితే ఈ వేసవిలో జరిగిన ప్రపంచకప్‌లో రోడ్రీ మళ్లీ తన అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాడు. స్పెయిన్‌ను రెండో ప్రపంచకప్ టైటిల్‌కు నడిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.తొలి ఆఫర్‌ను తిరస్కరించిన సిటీరోడ్రీ సిటీతో ఒప్పందం చివరి సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న నేపథ్యంలో బార్సిలోనా మొదట £38.5 మిలియన్ల ఆఫర్ చేసింది. అయితే సిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.ఆ తర్వాత బార్సిలోనా తమ ప్రయత్నాలను పెంచడంతో చివరకు సుమారు £65 మిలియన్లకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.రోడ్రీ కోసం రియల్ మాడ్రిడ్ కూడా ఆసక్తి చూపినప్పటికీ, చివరికి బార్సిలోనా రేసులో ముందంజ వేసింది.రోడ్రీ స్థానాన్ని భర్తీ చేయడానికి సిటీ ప్లాన్రోడ్రీ వెళ్లిపోవడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మాంచెస్టర్ సిటీ ఇప్పటికే 18 ఏళ్ల అయ్యూబ్ బౌయాదిపై దృష్టి పెట్టింది. లిల్లే తరఫున ఆడుతున్న ఈ యువ మిడ్‌ఫీల్డర్‌కు సుమారు £85 మిలియన్ల ధర ఉండొచ్చని సమాచారం.అదే సమయంలో సిటీకి మిడ్‌ఫీల్డ్‌లో మరిన్ని మార్పులు అవసరం కానున్నాయి. బెర్నార్డో సిల్వా, టిజ్జాని రేయిండర్స్ వంటి ఆటగాళ్లను కోల్పోయిన నేపథ్యంలో కొత్త మిడ్ఫీల్డర్ల కోసం క్లబ్ ప్రయత్నిస్తోంది.చెల్సీకి చెందిన ఎంజో ఫెర్నాండెజ్, బోర్న్మౌత్కి చెందిన అలెక్స్ స్కాట్, లివర్‌పూల్‌కి చెందిన అలెక్సిస్ మాక్ అలిస్టర్ కూడా సిటీ రాడార్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’
స్పెయిన్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు రోడ్రి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రోడ్రి ప్రస్తుతం జీవిత భాగస్వామి, లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ లారా ఇగ్లేసియాన్తో కలిసి ఇబిజాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇబిజాలో టూరిస్ట్ స్పాట్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న రోడ్రి, అటు పక్కనుంచి ఒక యువతి బికినీ వేసుకొని ఎదురుగా నడుస్తూ వచ్చింది. Photo Credit: Twitterదీంతో రోడ్రి గర్ల్‌ఫ్రెండ్ పక్కనుండగానే అటుగా వెళ్లున్న బికినీ యువతిని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. తనను దాటి వెళ్లిపోయినా కూడా రోడ్రి మాత్రం వెనక్కి తిరిగి మాత్రం ఆమె అందాన్ని కనులారా ఆస్వాధిస్తూ ముందుకు సాగడం విశేషం. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. చాలా మంది రోడ్రి చర్యను స్పానిష్ ఫోటోగ్రాఫర్ ఆంటోనియో గిల్లెం తీసిన 2015 నాటి ప్రసిద్ధ ‘డిస్ట్రాక్టడ్ బాయ్‌ఫ్రెండ్’ ఫొటోతో పోలుస్తున్నారు. ఆ ఫోటోలో, చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి, ఎర్రటి టాప్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతిని చూడటానికి వెనక్కి తిరుగుతాడు, అదే సమయంలో అతడి పక్కనే ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం అతడి చర్యకు ఆశ్చర్యానికి లోనవుతోంది. Photo Credit: Twitterఈ ఫొటో అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసి ఒక మీమ్ మెటిరీయల్‌గా మారిపోయింది. తాజాగా రోడ్రి కూడా తన గర్ల్‌ఫ్రెండ్ పక్కన ఉండగానే బికినీ వేసుకున్న యువతిని అదే పనిగా చూడడాన్ని ‘డిస్ట్రాక్టడ్ బాయ్‌ఫ్రెండ్’ మీమ్ ఫొటోతో పోల్చకుండా ఉండలేకపోతున్నారు. ‘అయినా అంత అందమైన భార్య పక్కనుండగా ఇదేం పాడుపని’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాను చిత్తు చేసింది చాంపియన్‌గా నిలిచింది. 16 సంవత్సరాల తర్వాత రెండో ఫిఫా టైటిల్ సాధించిన స్పెయిన్ జట్టులో రోడ్రి సభ్యుడిగా ఉన్నాడు.Rodri really recreated the meme 😭🤣 pic.twitter.com/YXNn25wEVZ— Not Match of the Day (@NOT_MOTD) August 9, 2026Read: ‘రోబోలు కాదు’.. ఆటగాళ్ల గాయాలపై లక్ష్మణ్ ఆగ్రహం! -
సైలెంట్‌గానే.. చరిత్ర సృష్టించాడు!
స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రోడ్రి అరుదైన ఘనత సాధించాడు. ‘కంప్లీట్ ఫుట్‌బాల్’ వీరుల జాబితాలో 30 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్ చేరిపోయాడు. కాగా న్యూయార్క్ వేదికగా భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2026 ఫైనల్లో స్పెయిన్ అర్జెంటీనాపై 1-0 గోల్ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చరిత్ర సృష్టించాడు!ఈ క్రమంలో రోడ్రి ఖాతాలో తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్ చేరింది. ఇంతకు ముందు అతడు UEFA చాంపియన్స్ లీగ్, బాలన్ డి ఓర్ అవార్డులు కూడా గెలిచాడు. ఫుట్‌బాల్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మూడు అవార్డులను గెలిచిన పదకొండో ప్లేయర్‌గా రోడ్రి చరిత్రకెక్కాడు.ఈ జాబితాలో సర్ బాబీ చార్ల్టన్, ఫ్రాంజ్ బెకెన్బ్యూయర్, గెడ్ ముల్లర్, పవోలో రోసి, జినెదైన్ జిదానే, రివాల్డో, రొనాల్డినో, కకా, లియోనల్ మెస్సీ, డెంబెలె రోడ్రి కంటే ముందు వరుసలో ఉన్నారు.గోల్డెన్ బాల్అదే విధంగా.. బాలన్ డి ఓర్, వరల్డ్‌కప్, చాంపియన్స్ లీగ్‌లతో పాటు గోల్డెన్ బాల్ గెలిచిన నాలుగో ఆటగాడిగానూ రోడ్రి నిలిచాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో రోడ్రి గోల్ కొట్టలేకపోవచ్చు. కానీ సహచరులు గోల్ కొట్టేలా అవకాశాలు కల్పించాడు. టోర్నీ ఆసాంతం అత్యుత్తమంగా రాణించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. దీంతో అతడిని గోల్డెన్ బాల్ వరించింది.ఈ అవార్డు అందుకున్న తొలి స్పెయిన్ ఆటగాడు కూడా రోడ్రి కావడం విశేషం. కాగా 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన రోడ్రి.. 2022లోనే తొలిసారి వరల్డ్‌కప్ ఆడాడు. ఇక ఈసారి ఏకంగా కెప్టెన్‌గా స్పెయిన్‌కు టైటిల్ అందించాడు. పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సి వంటి సారథులు ఎక్కువగా గోల్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. అత్యుత్తమ మిడ్ ఫీల్డర్కానీ రోడ్రి ఆట మాత్రం ఇందుకు భిన్నం. ఆరు అడుగులకుపైగా ఎత్తు ఉండే అతడు.. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ బంతిని పాస్ చేయడంలో దిట్ట. సహచరులు గోల్స్ కొట్టేలా అవకాశాలు సృష్టించే రోడ్రి ప్రపంచంలోని అత్యుత్తమ మిడ్ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీలో రోడ్రి ఏకంగా 790 పాస్‌లు అందించాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పాస్‌లు ఇచ్చిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. అర్జెంటీనాతో ఫైనల్లో రోడ్రి 101 పాస్‌లు కంప్లీట్ చేయడం విశేషం. చదవండి: స్పెయిన్ 20.. అర్జెంటీనా0: తెర వెనుక హీరో అతడే!


