breaking news
Robo fish
-
ముద్దొచ్చే మర చేప
ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు. సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్ఏను (‘ఇ–డీఎన్ఏ’గా పిలుస్తారు) సేకరించడం. ‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్లాస్టిక్‌కి చెక్‌పెట్టేలా... నీటిని ఫిల్టర్ చేసే చేప
మానువుని తప్పిదాల వల్ల నది జలాలు, సముద్రాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. వీటి కారణంగా జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా నదులు, సముద్రాల ఒడ్డున లక్షలాది చేపలు వంటి పలు జలచర జీవులు ఈ ప్లాస్టిక్ కారణంగా చనిపోతున్నాయి. ఇప్పుడూ ఆ ప్లాస్టిక్‌ని నీటి నుంచి సులభంగా వేరుచేసి ఫిల్టర్ చేసే రోబో చేప మన ముందుకు రానుంది. ఈ రోబో భవిష్యత్తు తరాలను నీటి కాలుష్యం నుంచి బయటపడేలా చేస్తోందంటున్నారు పరిశోధకులు. వివరాల్లోకెళ్తే...తాగు నీటిలో, నదుల్లో ఉండే ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే మైక్రో ప్లాస్టిక్‌ని ఏరేసి ఫిల్టర్ చేసే ఒక సరికొత్త త్రీడీ గిల్బర్ట్ రోబో చేపను రూపొందంచాడు సర్రే విశ్వవిద్యాలయ విద్యార్థి. ఈ రోబో చేప ఇంగ్లాండ్‌లోని సర్రే విశ్వవిద్యాలయం నిర్వహించిన నేచురల్ రోబోటిక్స్ కాంటెస్ట్ని గెలుచుకుంది. ఈ రోబోని కెమిస్ట్రీ గ్యాడ్యుయేట్ ఎలియనోర్ మాకింతోష్ అనే విద్యార్థి రూపొందించాడు. జలాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌ని తొలగించేడానికి ఈ రోబో ఉత్తమమైన పరిష్కార మార్గంగా భావిస్తున్నారు పరిశోధకులు. ఈ మేరకు సర్రే విశ్వవిద్యాలయంలోని లెక్చరర్ డాక్టర్ రాబర్ట్ సిడాల్ మాట్లాడుతూ..నదులు, సముద్రాల్లోకి విసురుతున్న ప్లాస్టిక్ ఎక్కడకి వెళ్తుందో తెలియదు. గానీ ఈ రోబో చేప భవిష్యత్తు తరాలను ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడుతుంది అనడంలో సందేహం లేదన్నారు. ఈ రోబో త్రీడీ గిల్బర్ట్ చేప తన తోక సాయంతో కదులుతుంది. ఇది ఈత కొడుతున్నప్పుడే నీటిన శుద్ధి చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది. నీటిని సేకరించడానికి నోటిని తెరుస్తుంది. దాని నోటిలో నీరు నిండిపోయిన వెంటనే మూసుకుపోతుంది. ఆ తర్వాత ఆ రోబో చేప అంతర్గత కుహరంలోని గిల్పాప్కి ఉన్న మెష్ ద్వారా ఫిల్గర్ చేసిన నీటిని బయలకు నెట్టేసి, ప్లాస్టిక్‌ని సంగ్రహిస్తుంది. ఈ రోబో చేప కాలుష్య పోరాటంలో చేరి ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఐతే మైక్రో ప్లాస్టిక్ మాత్రం శాశ్వతంగా తొలగిపోవాలంటే వందలు లేదా వేల ఏళ్లు పట్టవచ్చు అని చెబుతున్నారు. (చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ) -
నీటిలో చేపలా..!
నీటిలో అచ్చం చేపలాగే ఈదుతూ.. చేపలాగే సెకన్లలో దిశను మార్చుకునే సరికొత్త రోబో చేప ఇది. దీనిలోపల అమర్చిన డబ్బా నుంచి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం ద్వారా ఇది శరీరాన్ని సున్నితంగా కదిలిస్తూ దిశను మార్చుకుంటుంది. నీటిని తీసుకుని ఇది చేపల మాదిరిగా ఉబ్బిపోగలదు. 3డీ ప్రింటర్ సాయంతో తయారు చేసిన ఈ చేప నీటిలో 30 నిమిషాలు ప్రయాణించగలదు. నిజమైన చేపల గుంపులోకి పంపించి.. వాటి సహజ ప్రవర్తనను అధ్యయనం చే సేందుకని దీనిని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తయారు చేశారు.