breaking news
riyad jail
-
'రియాద్'లో మంగళూరు యువకుడికి మోసం.. ప్రధాని మోదీకి లేఖ ప్రయత్నం
కర్ణాటక: మంగళూరు యువకుడు రియాద్ దేశంలో వంచకుల చేతిలో మోసపోయి జైలుపాలయ్యాడు. మంగళూరు జిల్లా కడబ తాలూకా ఐతూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రియాద్‌లో అల్ఫానర్ సెరామిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఏడాది సెల్‌ఫోన్‌తోపాటు సిమ్ కొనుగోలుకు వెళ్లగా రెండు సార్లు తంబ్ తీసుకున్నారు. వారం తరువాత అరబిక్ భాషలో ఒక మేసేజ్ రాగా దాన్ని క్లిక్ చేశాడు. 2 రోజుల తరువాత ఒక కాల్ వచ్చింది. సిమ్ వివరాలు అడిగి ఓటీపీ నంబర్ తీసుకున్నారు. అనంతరం దుండగులు అతని పేరుతో ఖాతా ఓపెన్ చేసి ఓ మహిళ ఖాతానుంచి రూ.22వేలు అక్రమంగా బదిలీ చేశారు. ఇదంతా చంద్రశేఖర్‌కు తెలియదు. వారం తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. తనను ఎందుకు అరెస్ట్ చేశారని బాధితుడు ఆరా తీయగా నగదు పోగొట్టుకున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు కేంద్రమంత్రి శోభకరంద్లాజె వద్ద మొరపెట్టుకోగా ఆమె విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితంలేకుండాపోయింది. దీంతో ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ బాగుంటే చంద్రశేఖర్‌కు గత జనవరిలో వివాహం జరగాల్సి ఉంది. -
రియాద్ జైలులో 300 మంది భారతీయులు
100 తెలంగాణవాదులు రెండు నెలలుగా నరకయాతన ప్రభుత్వం పట్టించుకోని ప్రభుత్వాలు రాయికల్ : సౌదీలోని ఆర్థికమాద్యం తీవ్రంగా ఉండటంతో అక్కడి పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సౌదీలోని రియాద్, జెద్ద, దమామ్, వంటి ప్రాంతాల్లో ఎక్కువగా సోదాలు న్విహిస్తున్నారు. అకామ (వర్క్ పర్మిట్) గడువు ముగిసిన కార్మికులు కన్పిస్తే జైలులో పెడుతున్నారు. రియాద్ జైలులో 300 మంది భారతీయులుండగా వారిలో 100 మంది తెలంగాణవాదులు ఉన్నారు. రెండు నెలలు గడుస్తున్నప్పటికీ వీరిగురించి పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఒకే గదిలో 300 మందిని ఉంచడంతోపాటు భోజనం సరిగా లేకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా భారత ఎంబసీ అధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జైలులో ఉంటున్న కార్మికులను విడిపించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సౌదీలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంతో జెద్దలోని పలు కంపెనీల నుంచి 10 వేల మంది భారతీయులను ఉద్యోగం నుంచి నిర్ధాక్షిణ్యంగా తొలగించడంతోపాటు ఆయా కంపెనీలకు చెందిన కార్మికులకు సుమారు ఏడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు వారి పాస్‌పోర్టులు కంపెనీ యజమానుల వద్ద ఉండటంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కనీసం తినడానికి తిండి ఉండడానికి నివాసం కూడా లేకపోవడంతో ఆరుబయటనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల విదేశాంగ మంత్రి సుశ్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన విదేశాంగ మంత్రి సౌదీలోని కార్మికులకు భోజన వసతి కల్పించడంతో పాటు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం భారత ఎంబసి అధికారులు కార్మికులకు భోజన వసతి సైతం కల్పించి క్యాంపులో భారత కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఏఏ రాష్ట్రాలకు చెందిన వారు ఏఏ కంపెనీల్లో పనిచేస్తున్నారు, ఎన్ని వేల వేతనాలు కావాలనే అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఈ నివేదికను కేంద్ర విదేశాంగ మంత్రితో పాటు సౌదీ అధికారులతో చర్చించారు. కార్మికులకు స్వదేశానికి తీసుకువచ్చేలా భారతప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అక్కడి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే.సింగ్‌ను పంపించడంతో పాటు ఎప్పటికప్పుడు సౌదీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.