breaking news
Risky Journey
-
మలుపుల వద్ద రక్షణ చర్యలు లేవు.. అదుపు తప్పితే.. అంతే..!
నిర్మల్: దస్తురాబాద్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు వాహనదారులు జంకుతున్నారు. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు ఉండటం.. మలుపుల వద్ద రెయిలింగ్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్ల వెంట ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు మలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. కలమడుగు–పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో.. మండలంలోని కలమడుగు నుంచి పాండ్వాపూర్ వెళ్లే మార్గంలో డబుల్ రోడ్డు కావడంతో వాహనాలు వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ మార్గంలో పెర్కపల్లె సమీపంలో మూడు వ్యవసాయ బావులు, మున్యాల గ్రామ సమీపంలో రెండు వ్యవసాయబావులు, రేవోజీపేట గ్రామసమీపంలో మూడు వ్యవసాయ బావులు, బుట్టపూర్ గ్రామ సమీపంలో మూడు వ్యవసామ బావులు రోడ్డు పక్కనే ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏ మాత్రం అదుపు తప్పినా ఇందులో పడిపోయే ప్రమాదం ఉంది. మలుపుల వద్ద కానరాని రక్షణ.. పాండ్వాపూర్–కలమడుగు రోడ్డు మార్గంలో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దస్తురాబాద్ మండల కేంద్రంలో కుమురంభీం చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డుపై ఉన్న మలుపు వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రోడ్డును ఆనుకొని చెట్లు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పెర్కపల్లె ప్రాథమిక పాఠశాలతోపాటు మున్యాల, రేవోజీపేట, బుట్టాపూర్ గ్రామాల్లో ఉన్న మలుపుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించాలి.. రోడ్ల పక్కన వ్యవసాయ బావులు, మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్అండ్బీ అధికారులు సెఫ్టీ రాడ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సి ఉంటుంది.. కానీ ఇప్పటివరకు అధికారులెవరూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రక్షణ చర్యలు చేపట్టాలి ప్రమాదాలు జరగకుండా రో డ్ల పక్కన ఉన్న వ్య వసా య బావులు, మూల మలుపుల వద్ద సెఫ్టీ రాడ్లను ఏర్పాటు చేయాలి. తరచుగా ప్రమాదా లు జరిగే చోట బోర్డులు ఏ ర్పాటు చేస్తే డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటారు. – భూక్య రమేశ్, ఎర్రగుంటవాసి సమస్య పరిష్కరిస్తాం కలమడుగు–పాండ్వాపూర్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతాం. వ్యవసాయబావులు, మూల మలుపులపై సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. రక్షణ చ ర్యలు చేపట్టి త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. – మల్లారెడ్డి, ఆర్అండ్బీ డీఈ -
ప్రమాదకరంగా పుష్కర యాత్ర
టేకులపల్లి (ఖమ్మం) : ఖమ్మం జిల్లాలో అన్ని దారులు భద్రాచలం గోదావరి పుష్కరాల వైపే. ఇల్లెందు నుంచి కొత్తగూడెం వయా టేకులపల్లి రహదారి ఎన్నడూ లేని విధంగా వాహనాలతో రద్దీగా ఉంది. మండలంతో పాటు, చుట్టు పక్కల గ్రామాలు, దూర ప్రాంతాలకు చెందిన భక్త జనం పుష్కరాలకు వెళ్ళడంపైనే శ్రద్ద పెడుతున్నారు. ప్రధానంగా ఆటోలు, ట్రాలీలలో లోడుకు మించి ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. ఎంత ప్రమాదమైనా డోన్ట్ కేర్ అంటూ అంతా గోదావరి మాత, సీతారాములపై భారం మోపి పుష్కరాలకు తరలివెళ్తున్నారు. తగ్గుముఖం పడుతుందని అనుకుంటే చివరి రోజుల్లో మరింత భక్త జనం అధిక సంఖ్యలో పుష్కరాలకు తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సుపైన కూడా వదలకుండా ప్రయాణం చేస్తుండటం విశేషం. ఈ పరిస్థితులపై పోలీసులు, అధికారులు జర నజర్ వేస్తే మంచిది.