breaking news
rib fracture
-
Viral Video: భర్త హగ్.. భార్య ఎముకలు ఫట్..
చైనాలో ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. భర్త.. భార్యను ప్రేమతో హగ్ చేసుకున్నాడు.. అంతే, ఒక్కసారిగా ఎముకలు విరిగిన శబ్దం.. నొప్పితో విలవిల్లాడుతూ కిందపడిపోయింది. ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే ఐదు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. మరో ఎముకకూ పగులు ఏర్పడ్డాయి. చైనాలో జరిగిన ఈ ఘటన వెనుక అసలు కారణం తెలుసుకుని వైద్యులే ఆశ్చర్యపోయారు. తరచూ డైటింగ్ చేస్తూ భోజనం మానేయడం, ఎండకు దూరంగా ఉండటం వంటి అలవాట్లతో ఆమె ఎముకలు బలహీనపడటమే ఇందుకు కారణమని గుర్తించారు. చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాంగ్ అనే వ్యక్తి భార్య చలిగా ఉందని చెప్పడంతో ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఎముకలు విరిగినట్లు శబ్దం వినిపించింది. వెంటనే ఆమె తీవ్రమైన నొప్పితో కిందకు వంగిపోయింది. పైకి లేవలేకపోయింది. తాను సాధారణంగానే కౌగిలించుకున్నానని.. ఇంత తీవ్రమైన గాయాలవుతాయని ఊహించలేదని వాంగ్ తెలిపాడు.తన భార్య రాత్రంతా నొప్పితో బాధపడిందని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఛాతీకి సీటీ స్కాన్ చేశారు. అందులో ఐదు పక్కటెముకలు విరిగినట్లు, మరో పక్కటెముకకు సన్నటి పగులు ఏర్పడినట్లు తేలింది. అయితే, శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ణయించారు. మందులు, నొప్పి తగ్గించే ఔషధ ప్యాచ్‌లు ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే కోలుకుంటోంది. ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది.వైద్యులు ఆమెకు ఆస్టియోపొరోసిస్ ఉన్నట్లు గుర్తించినట్లు వాంగ్ వెల్లడించాడు. ఈ వ్యాధి కారణంగా ఎముకల సాంద్రత తగ్గి.. అవి బలహీనంగా మారతాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికే ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. ఆయన భార్య బరువు 45 నుంచి 50 కిలోల మధ్య ఉంటుంది. బరువు తగ్గేందుకు తరచూ డైటింగ్ చేసేది. ఒక్కోసారి రాత్రి భోజనం కూడా మానేసేది. రోజూ కనీసం ఒక కప్పు కాఫీ తాగేది. ఆమె కుటుంబానికి చెందిన దుకాణంలో పనిచేస్తుండగా.. ఆ షాపు ఇంటి నుంచి కారులో రెండు, మూడు నిమిషాల దూరంలోనే ఉంది. బయటకు వెళ్లినప్పుడు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పుకునేది. ఎండలో ఎక్కువసేపు గడిపేది కాదు.శరీరంలో విటమిన్ డి ఉత్పత్తికి సూర్యరశ్మి కీలకం. విటమిన్ డి ద్వారా శరీరం కాల్షియాన్ని సమర్థంగా గ్రహించగలుగుతుంది. ఎముకల సాంద్రతను కాపాడుకోవడానికి ఇది అవసరం. ఈ ఘటన తర్వాత తన భార్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని వాంగ్ తెలిపాడు. ఆమె ఎక్కువగా ఎండలో గడపడంతో పాటు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టిందని చెప్పాడు.వుహాన్ ఆసియా హార్ట్ జనరల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు యాన్ యాన్షియాంగ్ ఈ ఘటనపై స్పందించారు. సాధారణంగా యువతలో కౌగిలింత వంటి సాధారణ చర్యతో పక్కటెముకలు విరగడం చాలా అరుదని తెలిపారు. ఈ మహిళకు ఉన్న ఆస్టియోపొరోసిస్ గాయాల తీవ్రతకు కారణమై ఉండవచ్చని వివరించారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు.ఎండలో తక్కువగా గడపడం, రోజూ కాఫీ తాగడం వంటి అలవాట్లను ప్రస్తావిస్తూ.. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం నష్టం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బలమైన టీని అధికంగా తాగడం, ఇతర అనారోగ్యకరమైన అలవాట్లు, స్టెరాయిడ్ మందుల వాడకం కూడా ఎముకల నుంచి కాల్షియం నష్టాన్ని వేగవంతం చేయవచ్చని వివరించారు..抱断老婆 5 根肋骨 网传江苏一男子给老婆一个“热情拥抱”,老婆当场蹲地起不来 CT一拍:5根肋骨骨折,1根骨裂。 男子说本想抱紧点让她感受自己的热情,“真不是故意的”。 https://t.co/s3iiSLtXc7— 像树 (@gexx126657) October 19, 2026ఇదీ చదవండి: ఆకాశం నుంచి పిట్టల్లా రాలిపోతున్న ఉక్రెయిన్ డ్రోన్లు! -
Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు!
సిడ్నీ: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా తేలింది. ఆ్రస్టేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడికి ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అతడి పక్కటెముకల లోపలి భాగంలో రక్త స్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. వైద్య పరిభాషలో ‘స్పీన్ లేసరేషన్’గా వ్యవహరించే ఈ ప్రమాదంతో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంది. దాంతో వెంటనే శ్రేయస్‌ను స్థానిక ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స నిర్వహించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రేయస్ చికిత్సను పర్యవేక్షిస్తూ స్థానిక వైద్యులకు సహకరించేందుకు భారత టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్‌ను సిడ్నీలోనే ఉంచినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఎప్పటికప్పుడు శ్రేయస్ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది. కనీసం వారం రోజుల పాటు అతను సిడ్నీలోనే ఉండే అవకాశం ఉంది. తమ కొడుకు వద్దకు వెళ్లేందుకు శ్రేయస్ తల్లిదండ్రులు అత్యవసర వీసా కోసం ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా... శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
షూటింగ్లో గాయపడ్డ ఆమిర్ ఖాన్
బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ దర్శకుడు. హాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కు ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలో టామ్ హ్యాంక్స్ పోషించిన పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నారు. లాక్డౌన్ ముందే చాలా వరకు చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మిగిలిన భాగాన్ని పూర్చి చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమిర్ ఖాన్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న క్రమంలో అతని పక్కటెముకకు గాయమయినట్లు తెలుస్తోంది. అయితే షూట్‌కు ఎలాంటి ఆలస్యం కాకుదని భావించిన ఆమిర్ పెయిన్ కిల్లర్ తీసుకొని షూటింగ్ కొనసాగించినట్లు సమాచారం. చదవండి: నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: కాగా ఇంతకుముందు కూడా ఓ ముఖ్యమైన రన్నింగ్ సీక్వెన్స్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు అమీర్ ఖాన్ ఎక్కువగా పరుగెత్తినందుకు తీవ్ర శారీరక శ్రమకు గురయ్యాడు. ఇక ఇటీవలే కరీనా కపూర్ రెండోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీనా పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ ముందే పూర్తిచేయాలని చిత్రబృందం భావించింది. అలానే సెట్స్‌లో ఆమె సీన్స్ అన్నీ పూర్తి చేశారు. గతవారంతో కరీనా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసి, చిత్రబృందానికి బై బై చెప్పారు. ఆమిర్ ఖాన్‌తోపాటు ఇతర తారలతో మిగిలిన షెడ్యూల్స్‌ను టర్కీలో చిత్రీకరించడానికి సిద్ధం అవుతోంది చిత్రబృందం. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. చదవండి:ఇవేవి నా అభిరుచిని ఆపలేదు: కరీనా View this post on Instagram And all journeys must come to an end. Today, I wrapped my film Laal Singh Chaddha... tough times... the pandemic, my pregnancy, nervousness but absolutely nothing could stop the passion with which we shot, with all safety measures ofcourse. Thank you @_aamirkhan and @advaitchandan for an intense yet poignant journey... thank you to my most wonderful team @avancontractor, @teasemakeup, @makeupbypompy, @poonamdamania and the entire crew... @nainas89 you were missed. Till we cross paths again...❤️❤️🎈🎈 A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on Oct 15, 2020 at 12:50am PDT -
సినిమా షూటింగ్లో గాయపడ్డ హీరో
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ నటిస్తున్న 'భూమి' సినిమా షూటింగ్లో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో భూమి సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లో సంజయ్ నటిస్తుండగా ఆయన పక్క ఎముక ఫ్రాక్చర్ అయినట్టు యూనివర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ వాడి షూటింగ్ కొనసాగించాడు. నొప్పి తీవ్రం కావడంతో సంజయ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరిశీలించిన వైద్యులు చిన్న ఫ్రాక్చర్ అయినట్టు ధ్రువీకరించారు. గాయం నయమయ్యే వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సంజయ్‌కు సూచించారు. ఈ నెలాఖరులో సంజయ్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటాడని యూనిట్ వర్గాలు తెలిపాయి.


