breaking news
Retro Look
-
'రెట్రో' మూవీ రివ్యూ.. సూర్య హిట్ కొట్టాడా..?
టైటిల్ : రెట్రో’పైనేనటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జోజూ జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ తదితరులునిర్మాణ సంస్థలు: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: జ్యోతిక, కార్తేకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ఎడిటింగ్: షఫీక్ మొహమ్మద్ అలీదర్శకత్వం, కథ: కార్తీక్ సుబ్బరాజ్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణవిడుదల: మే1, 2025గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత ఏలాగైన తన అభిమానులను సంతోషపెట్టాలని ‘రెట్రో’పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి సూర్య తీసుకొచ్చాడు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ 2 గంటలా 40 నిమిషాల రన్‌టైమ్ ఉంది. గతంలో దర్శకుడు సుబ్బరాజ్ తెరకెక్కించిన పేట, మహాన్, జిగర్తాండ, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాల నిడివి కూడా ఇంతే ఉండటం గమనార్హం. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్ రెట్రోతో మెప్పించాడా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.కథేంటంటే..గ్యాంగ్‌స్టర్ తిలకన్ (జోజు జార్జ్) కొడుకులా పెంచుకున్న పారివేల్ కన్నన్ (సూర్య)తో గ్యాంగ్‌స్టర్స్‌గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుని చలామణి సాగిస్తుంటారు. అయితే, ఒకరోజు వారు ఫారిన్ గ్యాంగ్‌తో కుదుర్చుకున్న ఢీల్ (గోల్డ్ ఫిష్) వల్ల సమస్యలు వస్తాయి. అప్పటి వరకు తిలకన్ చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తి చేసిన పారివేల్.. గోల్డ్‌ఫిష్ ఢీల్‌ను వదులుకోవాలని పెంచిన తండ్రికి ఎదరుతిరుగుతాడు. ఇదే సమయంలో తన ప్రియురాలు రుక్మిణి (పూజా హెగ్డే)ని వివాహం చేసుకోవడానికి పారివేల్ రెడీ అవుతుంటాడు. తనతో పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని వదులుకుని ఆమెతో సాధారణ జీవితాన్ని గడుపుతానని వాగ్దానం చేస్తాడు. అలాంటి సమయంలోనే గోల్డ్ ఫిష్ వివరాలు చెప్పాలని ఆ పెళ్లికి అడ్డుగా తిలకన్ నిలబడుతాడు. తన గ్యాంగ్‌తో ఆ వేడుకలో అల్లకల్లోలం సృష్టిస్తాడు. దీంతో పారివేల్ కన్నన్ మళ్లీ ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. ఈ గొడవ కారణంగా ఐదేళ్లు జైలుకు వెళ్తాడు పారివేల్. గొడవలు అంటే నచ్చని రుక్మిణి అతని జీవితం నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఆచూకి వివరాలు తెలుసుకోవాలని తన గ్యాంగ్‌ను కోరతాడు. చివరికి ఆమె అండమాన్లకు దూరంగా ఒక ఐల్యాండ్‌లో ఉన్నట్లు వివరాలు తెలుసుకుంటారు. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని జైలు నుంచి తప్పించుకున్న పారివేల్ ఆమె ఉన్న చోటుకు వెళ్తాడు. దీంతో తనను పెంచిన తండ్రి తిలకన్ కూడా గోల్డ్‌ఫిష్ వివరాలు కోసం అదే ఐలాండ్‌కు చేరుకుంటారు. అయితే, అప్పటికే అక్కడ ఒక పెద్ద గ్యాంగ్‌తో రాజ్‌వేల్ దొర (నాజర్) అతని కుమారుడు మైఖేల్ ఉంటారు. అక్కడి ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని అనేక దారుణాలు చేస్తుంటారు. వారితో ఒక ఢీల్ సెట్ చేసుకుని తిలకన్ అక్కడికి చేరుకుంటాడు. తన ప్రియురాలు రుక్మిణి కోసం పారివేల్ ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే మళ్లీ గ్యాంగ్ వార్ మొదలౌతుంది. అక్కడి నుంచి గోల్డ్‌ఫిష్ వేట కొనసాగుతుంది. ఇంతకీ గోల్డ్‌ఫిష్ సీక్రెట్ ఏంటి..? దాని కోసం పెంచిన కొడుకునే తండ్రి చంపాలని ఎందుకు అనుకుంటాడు..? అనాధగా ఉన్న పారివేల్‌కు ఆ ఐల్యాండ్‌తో ఉన్న గత సంబంధం ఏంటి..? అక్కడి గుడితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి..? పారివేల్ పుట్టక ముందే రాజ్‌వేల్ దొర (నాజర్)తో ఉన్న లింక్ ఏంటి..? ఫైనల్‌గా రుక్మిణిని పారివేల్ పెళ్లి చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే.ఎలా ఉందంటే..?ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సూర్య తొలిసారి కలిసి పనిచేయడమే అని చెప్పవచ్చు. అందుకే, రెట్రో సినిమా ప్రేక్షకులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఊహించినట్లుగానే.. కార్తీక్ సుబ్బరాజ్, సూర్య బలాలను వెండితెరపై చూపించారు. యాక్షన్, రొమాన్స్ అంశాలను సమానంగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడు. చాలా సినిమాల్లో మాదిరే.. రెట్రో కథలో కూడా ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి ప్రయత్నించే ఒక గ్యాంగ్‌స్టర్ గురించి చెప్పారు. ఇందులో అతను ఎలా విజయం సాధిస్తాడు అనేది కాస్త ప్రత్యేకంగా చూపారు. సినిమా మొదటి భాగంలో తిలకన్, పారివేల్, రుక్మిణిల చుట్టూ తిరుగుతుంది. భారీ యాక్షన్ సీన్స్‌లకు కాస్త రొమాంటిక్ టచ్ ఇచ్చి కథను చూపారు. అదంతా మనకు రొటిన్‌గానే అనిపించవచ్చు. సెకండ్ పార్ట్ అంతా ఒక ఐలాండ్‌లో జరుగుతుంది. అక్కడి నుంచి స్క్రీన్‌ప్లే గజిబిజిగా మారడం ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న గ్యాంగ్స్టర్స్ రాజ్‌వేల్ దొర (నాజర్) అతని కుమారుడు మైఖేల్‌తో పారివేల్ పోరాటం చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి పూర్తిగా భిన్నమైన ట్రాక్‌లోకి స్టోరీ వెళుతుంది. ఇక్కడే సినిమా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అక్కడ ఐలాండ్‌లో జరిగే రబ్బర్ కల్ట్ పోటీలు కొత్తగా ఉంటాయి. ఆ పోటీల పేరుతో అక్కడున్న గిరిజన జాతి జీవితాలతో ఆడుకుంటున్న ఆ ప్రాంత రాజును పారివేల్ ఎదుర్కొన్న తీరు ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచుతాయి. ఐలాండ్‌లోని జడ ముని గుడి నేపథ్యంతో పాటు దానితో పారికి ఉన్న సంబంధం తెలిపిన పాయింట్ కాస్త భావోద్వేగభరితంగా కథను మారుస్తాయి.కథలో గ్రిప్పింగ్ లేకున్నా.. భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సూర్య, పూజాల మధ్య సరైన లవ్ ట్రాక్ కనిపించదు. కానీ, వారిద్దరి మధ్య చాలా ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ ఉన్నట్లుగా మనకు దర్శకుడు చూపే ప్రయత్నం చేశాడు. ఐల్యాండ్‌కు పారివేల్‌కు ఉన్న రిలేషన్ ఏంటి అనేది వివరంగా చెప్పడంలో విఫలం అయ్యాడనిపిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే రెట్రో సినిమాకు కాస్త మైనస్ అని చెప్పవచ్చు. కానీ, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సూర్య, పూజా హెగ్డేలను చాలా కొత్తగా దర్శకుడు చూపించారు.ఎవరెలా చేశారంటే..సూర్య తన అన్ని చిత్రాల మాదిరిగానే ఈ మూవీలో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్ అయినా, కామెడీ అయినా సూర్య చాలా అద్భుతంగా నటించాడు. పూజ హెగ్డేతో అతను కనిపించే సన్నివేశాలు పెద్దగా క్లిక్ కాకపోయిన కెమెరామెన్ పనితనంతో కాస్త గట్టెక్కించాడని చెప్పవచ్చు. రెట్రో డ్రెస్‌లో పూజా చాలా చక్కగా సెట్ అయిపోయింది. ఆపై గ్లామర్‌కు ఎలాంటి స్కోప్‌లేకుండా కేవలం యాక్టింగ్‌కు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడంతో తన కెరీర్లో ఇదొక బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ తిలకన్ పాత్రలో మరోసారి తన ప్రతిభను ప్రదర్శించగా, మైఖేల్ పాత్రను పోషించిన నటుడు కూడా అద్భుతంగా నటించాడు. ప్రకాష్ రాజ్ అతిధి పాత్రలో కనిపిస్తాడు, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అతిధి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.సంతోష్ నారాయణ్ ఇచ్చిన సంగీతం రెట్రోకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేసే అద్భుతమైన BGMను ఆయన అందించాడు. కన్నిమ పాట ఇప్పటికే థియేటర్లలో పెద్ద సంచలనంగా మారింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన రెట్రో మంచి ప్రయత్నమే కానీ చాలా ట్రాక్‌లతో కూడిన గజిబిజి స్క్రీన్‌ప్లే వల్ల కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. సూర్య, పూజా హెగ్డే తమ అభిమానులను రెట్రోతో తప్పకుండా అలరిస్తారు. -
రెట్రో లుక్‌లో పూజా హెగ్డే.. సింప్లీ సూపర్ (ఫోటోలు)
-
సూర్య ‘రెట్రో’ మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
రెట్రో లుక్‌లో వింటేజ్ గర్ల్ 'పూజా హెగ్డే' లుక్స్ (ఫోటోలు)
-
వాళ్లందరూ కేవలం ఫాలోవర్స్ మాత్రమే: పూజా హెగ్డే
సినిమా కళాకారులు సొంత డబ్బా కొట్టుకోవడం మామూలే. అది వారికి చాలా అవసరం కూడా. అయితే శ్రుతిమించితేనే హాస్యాస్పదంగా మారుతుంది. పూజా హెగ్డే(Pooja Hegde) ఇలాంటి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ముఖ్యంగా ఆ మధ్య తెలుగులో టాప్ హీరోయిన్గా వెలిగారు. అయితే ఆ తరువాత వరుస ఫ్లాప్‌లు ఎదురవడంతో మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నారు. ముఖ్యంగా తమిళంలో ముఖముడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే తొలి చిత్రంతోనే అపజయాన్ని మూటకట్టుకున్నారు. అదేవిధంగా పదేళ్ల తరువాత విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం నిరాశ పరిచింది. అలాంటిది మరోసారి ఆయనతో జతకట్టే అవకాశాన్ని అందుకోవడం విశేషం. విజయ్‌తో జత కడుతున్న జననాయకన్ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. సూర్యకు జంటగా నటించిన రెట్రో చిత్రం మే 1న తెరపైకి రానుంది. లారెన్స్‌కు జంటగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా తమిళంలో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన పూజాహెగ్డేకు ఈ చిత్రాల విజయాలు చాలా అవసరం. అయితే జననాయకన్, రెట్రో చిత్రాలపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు. ఈ పాట తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఉన్నారు. దీంతో ఒక ఇంటర్వ్యూలో పూజాహెగ్డే పేర్కొంటూ తనకు ఇన్‌స్ట్రాగామ్‌లో 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని సెల్ఫ్‌గోల్ కొట్టుకున్నారు. అయితే తన చిత్రాలకు 3 కోట్ల టికెట్లు అమ్ముడు పోతాయన్న నమ్మకం మాత్రం లేదని కూడా చెప్పుకొచ్చింది. కొందరికైతే ఏకంగా 26 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు.. వారి సినిమాలకు కూడా అంతమంది వెళ్లరని చెప్పింది. వాస్తవంగా పూజాకు కూడా 27 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కొందరు ప్రముఖులకు 50 లక్షల ఫాలోవర్స్ ఉంటారని, వారి చిత్రాలకు థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరుగుతుందని, సామాజిక మాధ్యమాలు నిజమైన ప్రపంచం కాదని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
సూర్య ‘రెట్రో’ మూవీ స్టిల్స్
-
సూర్య 'రెట్రో' సినిమా.. అలరిస్తున్న టీజర్
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ఈసారి అదిరిపోయే మాస్ కమ్ బ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. గతనెలలో 'కంగువ' (Kanguva Movie) మూవీతో వచ్చాడు. ప్రేక్షకులు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే 'బాహుబలి'లా తీద్దామనుకున్నారు కానీ మూవీ బెడిసికొట్టేసింది. ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజుతో ఓ మూవీ చేశారు. దానికి 'రెట్రో' (Retro Movie) అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)డీ గ్లామర్ లుక్‌తో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతుంటాడు. నీతో ప్రేమ కోసం రౌడీయిజం, గుండాయిజం అన్ని వదిలేస్తున్నానని.. మీ నాన్న దగ్గర పనిచేయడం కూడా మానేస్తానని చెప్పడం బాగుంది. ఓవైపు ఇంటెన్స్ యాక్షన్ చూపిస్తూనే.. ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పింది. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత మూడేళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్‌కి చాలా కీలకం. ప్రస్తుతానికి తమిళ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో మిగతా భాషల టీజర్స్ విడుదల చేస్తారేమో?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) -
చీరలో ముద్దుగుమ్మలా అలరిస్తున్న మేఘా ఆకాష్ (ఫోటోలు)