breaking news
retirement age60
-
60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?
శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేయాలనే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దాంతో యువ ఉద్యోగుల్లో 45 ఏళ్లు వచ్చేవరకే రిటైర్ అవ్వాలనే ధోరణి పెరుగుతోంది. అయితే ఇది ఆదోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, అడ్వైజర్ సార్థక్ అహుజా మాట్లాడుతూ..‘ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారతీయ కార్పొరేట్లలో ఆందోళన కలిగించే అంశం. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్ లేదా వైద్యం వంటి రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, అధిక వేతనం అందుతాయి. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్, టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఇందుకు పూర్తి విరుద్ధం. వయసు పెరిగేకొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలకు అలవాటుపడే మనస్తత్వం ఉండదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 40 ఏళ్ల పైబడినవారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ‘40 ఏళ్లు పైబడినవారు నైపుణ్యం లేనివారు కాదు. వారు యువ ప్రతిభావంతుల మాదిరి చురుకుగా ఉండకపోవచ్చు. కానీ వారి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీరిని పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి మెరుగైన నైపుణ్యాలు ఇచ్చేందుకు అప్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని అహుజా వివరించారు. -
‘వయో’ వరం.. అమలైతే సంబరం
ఏలూరు, న్యూస్‌లైన్ : టీడీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారుల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలవుతుందా.. లేదా అనే అంశంపై ఉద్యోగవర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, క్లాస్-4 ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి 60 ఏళ్ల వరకూ ఉంది. అరయితే, ప్రభుత్వ శాఖల్లోని ఎగువస్థాయి ఉద్యోగులు, గ్రూప్-1 అధికారుల పదవీ విరమణ వయసు మాత్రం 58 ఏళ్లుగానే ఉంది. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంఖ్య 25 వేలకు పైగా ఉన్నారు. వీరిలో పదవీ విరమణ సమీపించిన వారి సంఖ్య 5వేల వరకు ఉంటుందని అంచనా. కొద్దిమాసాల్లో రిటైర్ కానున్న ఉద్యోగులంతా చంద్రబాబు హామీపై గంపెడాశలు పెట్టుకున్నారు. 3 నెలల్లో నలుగురు అధికారుల పదవీ విరమణ రానున్న మూడు నెలలు కాలంలో నలుగురు జిల్లాస్థాయి అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. జూన్ నెలలో ట్రెజరీ డెప్యూటీ డెరైక్టర్ ఎన్వీకే మోహన్‌రావు, జూలైలో హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్ జి.సత్యనారాయణ, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, ఆగస్టు నెలాఖరున జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు పదవీ విరమణ చేయూల్సి ఉంది. చంద్రబాబు హామీ అమలులోకి వస్తే వారందరికీ మరో రెండేళ్లపాటు ఉద్యోగం చేసే అవకాశం కలుగుతుంది. నిరుద్యోగుల గుర్రు చంద్రబాబు హామీపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగాలు దొరక్క నిర్వేదంలో ఉన్న యువత ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచితే.. తమకు జీవితంలో ఉద్యోగాలు రావని ఆవేదన చెందుతున్నారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాల యంలో పేర్లు నమోదు చేయించుకున్న నిరుద్యోగుల సంఖ్య 59 వేలుగా ఉంది. పేర్లు నమోదు చేరుుంచుకోని వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. పోటీ పరీక్షలు కూడా ప్రతి ఏడాది జరగడం లేదు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నా ప్రభుత్వ కొలువులు యువతకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. దీనికి తోడు గ్రూప్-4 (క్లరికల్ గ్రేడ్) పోస్టుల్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఇటీవల వీఆర్వో, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం పోటీ పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల వయోపరిమితిని పెంచడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.