breaking news
retail loan
-
రిటైల్ రుణాల పట్ల జాగ్రత్త
భవిష్యత్తు రిటైల్ రుణాల విషయంలో బ్యాంక్‌లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ రంగానికి చెందిన వెటరన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ సూచించారు. పోర్ట్‌ఫోలియో (రుణ ఆస్తులు) పరంగా అస్థిరతలు లేకుండా చూసుకోవాలని కోరారు. బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కామత్ మాట్లాడారు.కార్పొరేట్లు (కంపెనీలు) నిధుల కోసం బ్యాంకులపై ఆధారపడడం కొంత కాలానికి తగ్గుతుందంటూ.. భవిష్యత్తులో బ్యాంకులకు ప్రధాన వ్యాపారం రిటైల్ విభాగం నుంచే వస్తుందన్నారు. రిటైల్ విభాగంలో ఆస్తుల నాణ్యత వేగంగా క్షీణించే రిస్క్ ఉంటుందని హెచ్చరించారు. ఈ రిస్క్ పోర్ట్‌ఫోలియో పరంగా అసమానతల రూపంలో ఎదురవుతుందన్నారు. బ్యాలన్స్‌షీట్లలో లోపాలు చోటుచేసుకుంటే అన్సెక్యూర్డ్ రుణాల్లో అధిక భాగం వసూలు కాకుండా పోతాయంటూ, బ్యాంక్‌లు ఈ విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.ఫిన్‌టెక్‌లతో బ్యాంకులు పోటీపడక తప్పదన్నారు. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు ఫిన్‌టెక్‌లు రుణ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ రుణ విభాగంలో పరిమితికి మించి రుణ వితరణ (ఒకే వ్యక్తికి) ఉందన్నారు. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో రూ.1.75 లక్షల కోట్లు నష్టపోయారన్న ఇటీవలి సెబీ డేటాను కామత్ ప్రస్తావించారు. నియంత్రణ సంస్థలు ఇప్పుడు దీన్ని కఠినతరం చేస్తున్నాయంటూ, ఈ చర్యలు ఫలితాన్నిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే రుణ ఎగవేతలు పెరగొచ్చొని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.35,000 వరకు ఆఫర్ -
గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్!
దేశంలో రోజువారి లెక్కన సరకులు తెచ్చి అమ్ముకొని జీవనం సాగించే వీధి వ్యాపారులకు లోన్లు కావాలంటే బ్యాంకులు, లేదంటే ఇతర ఫైనాన్స్ కంపెనీలు చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి వ్యాపారస్తుల్ని గట్టెక్కించేలా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన యూపీఐ పేమెంట్స్ ఫ్లాట్‌ఫారమ్ గూగుల్ పే ద్వారా వారికి రుణాలు అందించేందుకు సిద్ధమైంది. భారత్‌లో గూగుల్ 9వ ఎడిషన్ ‘గూగుల్ ఫర్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం వినియోగదారుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది వివరించడంతో పాలు పలు ప్రొడక్ట్‌లు విడుదల, భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తుంది. చిరు వ్యాపారులకు శుభవార్త సెప్టెంబర్ 19 ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఈవెంట్లో చిరు వ్యాపారులకు గూగుల్ శుభవార్త చెప్పింది. భారత్‌లోని చిరు వ్యాపారులకు చేయూతనందించేలా తన యూపీఐ పేమెంట్ ఫ్లాట్‌ఫారమ్ ‘గూగుల్ పే’ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటికే గూగుల్ పే ద్వారా లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. Our experience with merchants has taught us that they often need smaller loans and simpler repayment options. To meet this need, sachet loans on Google Pay with @DMIFinance will provide flexibility and convenience to SMBs, with loans starting at just 15,000 rupees and can be… pic.twitter.com/SehpcQomCA — Google India (@GoogleIndia) October 19, 2023 రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు రుణాలు చిన్న మొత్తంలో రుణాలు అందించేలా గూగుల్.. డీఎంఐ ఫైనాన్స్ సంస్థతో చేతులు కలిపింది. దీంతో వ్యాపారులు గూగుల్ యూపీఐ నుంచి రూ.10,000 నుంచి రూ.1లక్ష వరకు లోన్లు అందిస్తుంది. వాటిని తిరిగి 7 నెలల నుంచి 12 వ్యవధిలోపు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ ఈఎంఐ రూ.111 అంతేకాదు, వ్యాపార నిమిత్తం అవసరమే నిధుల అవసరాల్ని తీర్చేలా క్రెడిట్లైన్ (credit line) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ పద్దతిలో అతి తక్కువ రూ.15,000 తీసుకుంటే నెల ప్రారంభ ఈఎంఐ రూ.111 చెల్లించాలి. వ్యక్తిగత రుణాలు చెల్లించేలా యాక్సిస్ బ్యాంక్‌తో, యూపీఐ ద్వారా క్రెడిట్ లైన్స్ రుణాలు కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో జతకట్టింది. చిరు వ్యాపారులకోసం ఏఐ సాయం భారత్‌లోని చిరు వ్యాపారుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు పునరుద్ఘాటించింది. ఏఐ సాయంతో గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్(Google Merchant Center Next)లో వ్యాపారుల ప్రొడక్ట్‌ల వివరాల గురించి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందించనుంది. అయితే, ఉత్పత్తుల గురించి ఎలాంటి సమాచారాన్ని గూగుల్ మర్చెంట్ సెంటర్ నెక్ట్స్‌లో ఇవ్వాలనే అంశం వ్యాపారుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. 100కి పైగా ప్రభుత్వ పథకాల సమాచారం త్వరలో, భారత్‌లోని వినియోగదారులకు 100కి పైగా ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్నిఅందించేలా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా గూగుల్ భవిష్యత్ కార్యచరణను ప్రకటించింది. రూ.12,000 కోట్ల విలువైన మోసాలకు చెక్ గూగుల్‌లో పేలో రూ.12,000 కోట్ల విలువైన ఆర్ధిక మోసాలకు చెక్ పెట్టిన గూగుల్.. అందుకు సాయం చేసే 3,500 లోన్ యాప్‌లను బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుంది. -
రిటైల్ రుణాలపై సిండికేట్ బ్యాంక్ దృష్టి
సాక్షి, అమరావతి: పండుగలను దృష్టిలో పెట్టుకొని రిటైల్ రుణాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. వచ్చే డిసెంబర్ వరకు రిటైల్ రుణాలను అదనంగా 0.25 శాతం తగ్గింపు ధరలకే అందిస్తున్నట్లు సిండికేట్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ (ఏపీ, తెలంగాణ హెడ్) ఎస్.పి.శర్మ తెలిపారు. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలను వసూలు చేయడం లేదన్నారు. మరోవైపు ఎంఎస్ఎంఈ రుణాలు, కాసా ఖాతాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కార్లపై ఆన్‌రోడ్ ధరలో 95 శాతం వరకు రుణాన్ని సిండికేట్ బ్యాంక్ అందిస్తోందన్నారు. శుక్రవారం విజయవాడ రీజియన్ సమీక్షకు వచ్చిన శర్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాజధాని తరలిరావడంతో ఇక్కడి విస్తరణపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో రాజధాని పరిసర ప్రాంతాల్లో కొత్తగా 10 శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ రీజియన్‌లో 79 శాఖలను సిండికేట్ బ్యాంక్ కలిగి వుంది. ఎన్పీఏలను తగ్గించుకోవడానికి చేపట్టిన వన్‌టైమ్ సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వచ్చినట్లు శర్మ తెలిపారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన 45 ఎన్పీఏ ఖాతాలను ఈ స్కీం కింద పరిష్కరించినట్లు తెలిపారు. మరో రూ. 10 కోట్ల ఎన్పీఏలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ రీజియన్‌లో సిండికేట్ బ్యాంక్‌కు రూ. 135 కోట్ల ఎన్పీఏలున్నాయి.