breaking news
Restrictions on the media
-
370 రద్దుపై ఎన్సీ సవాల్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ఉన్న రాజ్యాంగబద్ధ హోదాను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయా న్ని సవాల్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పౌరుల సమ్మతి లేకుండానే వారి హక్కులను కేంద్రం లాగేసుకుందని పేర్కొంది. జమ్మూకశ్మీర్ పునర్వ్య వస్థీకరణకు సంబంధించిన చట్టం అమలు కాకుండా చూడాలని ఎన్సీకి చెందిన ఎంపీలు మహమ్మద్ అక్బర్ లోనె, హస్నైన్ మసూదీ తమ పిటిషన్లో పేర్కొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ శాశ్వతమైంది. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2019, రాష్ట్రపతి ఉత్తర్వుల ఫలితంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దయ్యాయి. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ జించి ప్రజల హక్కులను కాలరాశారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు రాజ్యాంగవిరుద్ధం. భారత సమాఖ్య వ్య వస్థ, ప్రజాస్వామ్యం, చట్ట పాలనకు సంరక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ విషయమై స్పందించాలి. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాలను అమలు కాకుండా రద్దు చేయాలి’ అని కోరారు. మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలి జమ్మూకశ్మీర్‌లో మీడియాపై కొనసాగుతున్న ఆం క్షలను ఎత్తివేయాలంటూ కశ్మీర్ టైమ్స్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 4వ తేదీ నుంచి కొనసాగుతున్న నియంత్రణల కారణంగా కశ్మీర్‌తో పాటు జమ్మూలోని కొన్ని జిల్లాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయన్నారు. -
మీడియాపై ఆంక్షల పట్ల జగన్ ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో మీడియాపై ఆంక్షలు విధించడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులు ఆయన వద్ద ఆంక్షల విషయం ప్రస్తావించారు. దీనికి జగన్ స్పందిస్తూ.. ఆంక్షలు విధించడం సరైన పద్థతి కాదని అన్నారు. ప్రజా సమస్యలపై అభిప్రాయాలు వెల్లడించే హక్కు సభ్యులకు ఉంటుందని చెప్పారు. సభలో సభ్యుల గొంతు నొక్కినప్పుడు ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించడం వంటివి చేస్తారని, వాటిని ప్రసారం చేయకూడదని నియంత్రించడం సరికాదని జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.