breaking news
Removal from duty
-
అక్రమాస్తుల కేసు.. ఉద్యోగం నుంచి బాలకృష్ణ తొలగింపు ?
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శివ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించే అంశంపై పురపాలక ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరోపక్క బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన పలువురు ఉద్యోగులకు ఏసీబీ నోటీసులిచ్చింది. ఉద్యోగులతో పాటు బాలకృష్ణతో అక్రమ లావాదేవీలు జరిపిన వారిని ఏసీబీ విచారించనుంది. ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలు, బ్యాంకు లాకర్లపైన ఏసీబీ దృష్టి పెట్టింది. కాగా, శివబాలకృష్ణను 10రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ వేసిన కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో కోర్టు విచారించనుంది. కోర్ట బాలకృష్ణను కస్టడీకి ఇస్తే ఆయన జరిపిన లావాదేవీలు, బినామీలకు సంబంధించిన వ్యవహారాలు తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది. బాలకృష్ణ చెప్పే విషయాల ఆధారంగా ఈ కేసులో మరికొందరి అరెస్టులు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శివబాలకృష్ణ ఇంటిపై రెయిడ్స్ జరిపిన ఏసీబీ ఆయన ఆదాయానికి మించి ఆస్తులను పోగేసినట్లు తేల్చింది. దీంతో అక్రమాస్తుల కేసులో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే ఆయన భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ఏసీబీకి బాలకృష్ణ భాదితుల క్యూ.. అక్రమాస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్టయిన తర్వాత ఆయన బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. లే అవుట్లకు, నిర్మాణాలను అనుమతులిచ్చేందుకుగాను తమతో శివబాలకృష్ణ జరిపిన లావాదేవీలపై వారు ఫిర్యాదు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఏసీబీని కోరుతున్నారు. ఇదీచదవండి.. కేటీఆర్ తన భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి -
విద్యార్థినికి ప్రేమలేఖలు
ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగింపు ఈఓ మోత్కూరు(నల్గొండ జిల్లా): విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినికి ప్రేమ లేఖలు రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడేళ్లుగా ఆర్డ్స్ అండ్ క్రాఫ్స్ టీచర్‌గా పనిచేస్తున్న గూడెపు పరమేశ్ అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి తనను ప్రేమించాలంటూ ప్రేమ లేఖలు రాశాడు. గతంలో ప్రేమ లేఖలు రాసిన సందర్భంలో పరమేశ్‌ను ప్రధానోపాధ్యాయుడు మందలించాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పులేదు. గత 15 రోజుల్లో రెండుసార్లు విద్యార్థినికి ప్రేమలేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశాడు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ విచారణ జరిపారు. అనంతరం ప్రేమ లేఖలు రాసిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంఈఓ అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి తెలిపారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు.