breaking news
Religare Health Insurance
-
శివిందర్ సింగ్ బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు స్వాధీనం
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ నిధుల మళ్లింపు కేసులో మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్, నాలుగు సంస్థలకు చెందిన బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను స్వాధీనం చేసుకోవాలని సెబీ ఆదేశించింది. వీరి నుంచి జరిమానా వసూలు చేసుకోవాల్సి ఉండడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ సబ్సిడరీయే రెలిగేర్ ఫిన్వెస్ట్. శివిందర్ మోహన్ సింగ్, మలవ్ హోల్డింగ్స్, ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, ఏఎన్ఆర్ సెక్యూరిటీస్, రెలిగేర్ కార్పొరేట్ సర్వీసెస్‌కు సంబంధించి ఎలాంటి డెబిట్ లావాదేవీలను అనుమతించొద్దని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలను సెబీ ఆదేశించింది. వీరికి సంబంధించి అన్ని ఖాతాలు, లాకర్లను అటాచ్ చేయాలని కోరింది. నిధులు మళ్లించిన కేసులో రూ.48 కోట్లను చెల్లించాలంటే ఈ నెల మొదట్లో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ మాజీ ప్రమోటర్లు మాల్విందర్ మోహన్ సింగ్, శివిందర్ మోహన్ సింగ్‌లను సెబీ ఆదేశించం గమనార్హం. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, మలవ్ హోల్డింగ్స్ అన్నవి రెలిగేర్ ఎంట్ర్ప్రైజెస్ మాజీ ప్రమోటర్ సంస్థలు. ఏఆర్ఆర్ సెక్యూరిటీస్, రెలిగేర్ కార్పొరేట్ సర్వీసెస్ అన్నవి ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌కు సబ్సిడరీలుగా ఉన్నాయి. -
హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి రెలిగేర్ బయటకు!
న్యూఢిల్లీ: రెలిగేర్ ఎం టర్‌ప్రైజెస్ వైద్య బీమా నుంచి తప్పుకుంటోం ది. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో తనకున్న మొత్తం 80% వాటాను రూ. 1,040 కోట్లకు విక్రయించనుంది. ఈ వాటాను ట్రూ నార్త్ మేనేజర్స్ అనే ప్రైవేటు ఈక్విటీ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ల కన్సార్టియమ్ కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఒప్పందాన్ని ట్రూ నార్త్ మేనేజర్స్ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ల బృందంతో కుదుర్చుకున్నట్టు, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో తమకున్న మొత్తం వాటాను విక్రయించనున్నట్టు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ బీఎస్ఈకి సమాచారం అందించింది. కొనుగోలు చేస్తున్న ఇన్వెస్టర్లలో గౌరవ్ దాల్మియా, ఫేరింగ్ కేపిటల్ కూడా ఉన్నాయి. రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో యూనియన్ బ్యాంకుకు 5% వాటా ఉంది. కీలకమైన వ్యాపారంపై దృష్టి పెట్టాలన్న రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ విధానంలో భాగంగానే తాజా విక్రయమని గ్రూపు సీఈవో మణిందర్‌సింగ్ తెలిపారు.