breaking news
Reliance Infocom Ltd
-
జియో నుంచి ఎయిర్‌టెల్‌కు రూ.1,005 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం పూర్తి చేసుకున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా మూడు సర్కిళ్లలో ఎయిర్టెల్ ఆధీనంలో ఉన్న 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే హక్కులు రిలయన్స్ జియోకు లభించినట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఇందుకు సంబంధించి రూ.1,005 కోట్లను అందుకున్నట్టు పేర్కొంది. అలాగే, ఈ స్పెక్ట్రమ్‌కు సంబంధించి భవిష్యత్తులో రూ.469 కోట్ల చెల్లింపుల బాధ్యత కూడా జియోపై ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో జియోకు ఎయిర్టెల్ స్పెక్ట్రమ్‌ను వినియోగించుకునే అవకాశం లభించినట్టయింది. ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించడం గమనార్హం. 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ వల్ల జియో నెట్వర్క్ యూజర్లకు ఇండోర్ (భవనాల్లోపల) కవరేజీ మెరుగుపడనుంది. -
‘ముఖేశ్ కోర్టుకు హాజరు కానక్కర్లేదు’
న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల నాటి ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి స్వయంగా కోర్టుకు హాజరుకావడంపై రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం మినహాయింపునిచ్చింది. మొబైల్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కేసులో కోర్టుకు కావాలని జూన్ 7న చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముఖేశ్‌కు సమన్లు పంపారు. ముఖేశ్ అభ్యర్థన మేరకు ఆయనకు బదులు సెప్టెంబర్ 10న అధీకృత ప్రతినిధి ఎవరైనా కోర్టుకు హాజరుకావచ్చని హైకోర్టు పేర్కొంది.