breaking news
refusing marriage
-
కాలేజీ విద్యార్థి హత్యలో బిగ్ ట్విస్ట్.. మూడు రోజుల ముందే స్కెచ్ వేసి..
ఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థిని(25)ని ఓ యువకుడు ఇనుప రాడ్డుతో బాది హతమార్చాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఢిల్లీ మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో జరిగింది. బాధితురాలిని కమల నెహ్రూ కాలేజీ విద్యార్థినినిగా గుర్తించారు. మూడు రోజుల ముందే పథకం ప్రకారం నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని ఇర్ఫాన్‌గా గుర్తించారు. బాధితురాలు ఇర్పాన్ ప్రేమించుకున్నారు. కానీ ఇర్ఫాన్‌కు సరైన ఉద్యోగం లేని కారణంగా వివాహానికి బాధితురాలు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యువతి ఇర్పాన్‌తో మాట్లాడటం మానేసింది. స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే ఇర్ఫాన్.. తన తమ్ముడికి కూడా వివాహం కుదరడంతో అవమానానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. పక్కా పథకంతో.. బాధితురాలు మాట్లాడకపోయేసరికి ఆగ్రహానికి గురైన ఇర్ఫాన్.. ఏదో ఒకటి తేల్చుకోవాలని అనుకున్నాడు. ప్రియురాలు రోజూ స్టెనోగ్రఫీ ట్రైనింగ్‌కు వెళుతుందని ముందే తెలిసి మూడు రోజుల ముందే పథకం పన్నాడు. పార్కుకు పిలిచి ప్రేమ వ్వవహారంపై ప్రశ్నించాడు. కానీ బాధితురాలు ఒప్పుకోకపోయేసరికి విచక్షణ కోల్పోయాడు. బాధితురాలిని ఇనుప రాడ్డుతో తలపై బాది హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసుకుని మాలవీయ నగర్లో స్టెనోగ్రఫీ కోచింగ్‌కి బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. 'మాలవీయ నగర్‌లోని అరబిందో కాలేజీ వద్ద ఉన్న పార్క్‌లో ఓ బాలిక మృతదేహం పడి ఉందని మాకు సమాచారం వచ్చింది. బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి పార్కుకు వచ్చినట్లు తెలుస్తోంది. యువతి తలకు బలమైన గాయం తగిలింది. ఆమె మృతదేహం పక్కనే ఇనుప రాడ్డు పడి ఉంది.' అని ఢిల్లీ డీసీపీ చందన్ చౌధరి తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్పందించారు. నాగరికత ఉన్న దేశ రాజధానిలో ఓ అమ్మాయిని కొట్టి చంపారు. ఢిల్లీలో రక్షణ కరవైంది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. కేవలం వార్తాపేపర్లలో మాత్రం అమ్మాయిల పేర్లు మారుస్తున్నారు. నేరాలు ఆగడం లేదని ట్వీట్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించనట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష ఒక్కటే సరైనది.. ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో నిందితునికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు మించి ఏదైనా తక్కువేనని బాధితురాలి తండ్రి అన్నారు. తనకు ఉన్నది ఒక్కతే కూతురని చెప్తూ విలపించారు. #WATCH | Woman murdered in Malviya Nagar | "We need death penalty for the accused, nothing less. I had only one daughter…I won’t leave him”, father of the victim breaks down pic.twitter.com/TEQkhiqRwf — ANI (@ANI) July 28, 2023 ఇదీ చదవండి: ప్రొఫెసర్ ఘాతుకం.. తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులు.. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..
మునుగోడు (మర్రిగూడ) : ప్రియుడు పెళ్లికి నిరాకరంచడంతో ఓ విద్యార్థిని బలవన్మణానికి పాల్పడింది. వివరా లు.. మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన నక్క పాపయ్య–సత్తమ్మ దంపతులకు ఐదుగురి సంతానం. మూడో కూతురు నక్క వెన్నెల (17) మండల కేంద్రంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది.ఈమె తమ సమీప బంధువును కొంత కాలం నుంచి ప్రేమిచింది. పెళ్లి చేసుకోవాలని సదరు యువకుడిని అడగడతో నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన చెంది సరంపేట క్రాస్ రోడ్డు వద్ద పురుగుల మందు తాగింది. ఆమెను మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రీకి తీసుకువస్తుడంగా మధ్యమార్గంలో చనిపోయింది. కేసు నమోదు యేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ కె.కొండల్‌రెడ్డి తెలిపారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని పెట్రోల్ పోసి..
ముల్తాన్: పెళ్లికి ఒప్పుకోనందుకు యువతిపై అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో.. ఆమె దాదాపు నెల రోజుల పాటు మరణంతో పోరాడి పోరాడి.. ఓడిపోయింది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్తానీ యువతి మంగళవారం మృతి చెందింది. తనతో పెళ్లికి నిరాకరించినందుకు సోనియా బీబీ(20)పై మాజీ ప్రియుడు లతీఫ్ అహ్మద్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన ముల్తాన్ జిల్లాలోని మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో సోనియాబీబీ శరీరంలో 45 నుంచి 50 శాతం కాలిపోయింది. ఈ దాడి చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లతీఫ్ అహ్మద్(24) ని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఛాందసవాదులు, పితృస్వామిక సమాజానికి వ్యతిరేకంగా మహిళల అభ్యున్నతి కోసం పోరాడే ఔరత్ ఫౌండేషన్ ఈ దాడిని ఖండించింది. 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో దాదాపు 3000 మంది మహిళలు వివిధ రకాల దాడుల్లో హత్యకు గురయ్యారని ఔరత్ ఫౌండేషన్ వెల్లడించింది.