breaking news
Redmi 4G
-
బడ్జెట్ ధరలో.. అదిరే ఫీచర్లతో రెడ్మీ కొత్త ఫోన్!
కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని మహమ్మారిని ఏం చేయలేకపోయింది. దీంతో గతేడాది దేశీయ మార్కెట్లో సుమారు 2లక్షల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 24శాతం వాటాతో భారత్‌లో టాప్ బ్రాండ్‌గా ఉన్న షావోమీ వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తుంది. తాజాగా షావోమీ రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. హోలీ సందర్భంగా మర్చి 17న దేశీయ మార్కెట్లో రూ.15వేల బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కొత్త ఫోన్ అమ్మకాలు ప్రారంభిస్తామని షావోమీ ప్రతినిధులు ప్రకటించారు. రెడ్మీ 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ►స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓఎస్ ప్రాసెసర్ ►18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ►ఫోన్ ముందు పై భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ ►50ఎంపీ మెయిన్ కెమరా సెన్సార్లు ►మ్యాక్రో ఫోటో గ్రఫీ కోసం 2ఎంపీ సెన్సార్లు చదవండి: ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్, అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్ ఫోన్!! -
ఇక షాపుల్లో షియోమీ ఫోన్లు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనా కంపెనీ షియోమీ ఆఫ్‌లైన్ బాట పడుతోంది. ఇప్పటి వరకు కేవలం ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా వివిధ మోడళ్లను భారత్‌లో విక్రయించిన ఈ చైనా ఆపిల్.. కొద్ది రోజుల్లో దేశీయ మార్కెట్లో రిటైల్ షాపుల్లోనూ దర్శనమీయనుంది. భారత్‌తోపాటు పలు దేశాల్లో హల్చల్ చేస్తున్న షియోమీ మొబైళ్లు సంప్రదాయ దుకాణాలకు చేరితే సంచలనాలు నమోదవడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. తమ కంపెనీ ఫోన్ల కోసం ప్రతివారం 2 నుంచి 3 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయని షియోమీ ఇండియా హెడ్ మను జైన్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే రోజున 1.75 లక్షల పీసులు విక్రయించామన్నారు. అయితే ఇటీవల ఆవిష్కరించిన రెడ్మి నోట్ 4జీ మోడల్ ఎయిర్టెల్ ఔట్లెట్లలో డిసెంబర్ నుంచి లభించనున్న సంగతి తెలిసిందే. రెడ్మి నోట్, మి 3, రెడ్మి 1ఎస్ కంపెనీ ఇతర మోడళ్లు. అభిమానులు పెరుగుతున్నారు.. షియోమీ అభిమానులు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నారని సంస్థ వైస్ ప్రెసిడెంట్ హ్యూగో బరా అంటున్నారు. భారత్‌లో ఆఫ్‌లైన్ అమ్మకాల్లోకి త్వరలోనే ప్రవేశిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడి స్టార్టప్, అప్లికేషన్ డెవలపర్లు, సర్వీస్ ప్రొవైడర్లతో కలసి పని చేస్తామని చెప్పారు. ఇండోనేసియాలో గురువారం జరిగిన స్టార్టప్ ఆసియా జకార్తా 2014 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇండోనేసియాలోని ఇరాజయకు చెందిన రెండు స్టోర్లలో ఒకే రోజు 2,000 ఫోన్లు విక్రయించాం. ఆఫ్లైన్లోనూ స్పందన ఉందనడానికి ఇదే నిదర్శనం’ అని చెప్పారు. గూగుల్ వన్ ఫోన్ తయారీ ప్రాజెక్టులో పాలుపంచుకోవడం ఖాయమన్నారు. కాగా, ఒక ఉత్పత్తిని కొన్ని గంటలు మాత్రమే విక్రయించే ఫ్లాష్ సేల్స్/డీల్ ఆఫ్ ద డే విధానం అన్ని సందర్భాల్లోనూ భారత్‌లో విజయవంతం కాదన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్‌తో షియోమీ జత కలిసిందని వారంటున్నారు.