Realty Act
-
రియల్టీకి యూడీఎస్ భూతం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) భూతం పట్టుకుంది. అవిభాజ్య స్థలం ధర తక్కువే ఉంటుంది కావచ్చు.. కానీ, స్థలానికి సంబంధించి ఏమైనా న్యాయపరమైన చిక్కులొచ్చినా, నిర్మాణ అనుమతులు రాకపోయినా నష్టపోయేది మాత్రం కొనుగోలుదారులే. యూడీఎస్లో కొనుగోలు చేస్తే కలిగే నష్టాలపై కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు, రెరా అనుమతి పొందిన ఏజెంట్ల నుంచి మాత్రం కొనుగోళ్లు జరపాలని సూచిస్తుంది. 2017, జనవరి 1వ తేదీ తర్వాత 500 చ.మీ. లేదా 6 యూనిట్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి పొందిన ప్రతీ ప్రాజెక్ట్ తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్–రెరా) నిబంధనలను పాటించాల్సిందే. కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసే ప్రాపర్టీ టీఎస్–రెరాలో నమోదైందో లేదో నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవటం ఉత్తమమని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రామకృష్ణా రావు తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయికి తగ్గ విలువను, సామాన్యుల పెట్టుబడులకు భరోసాను కల్పించే రెరా ప్రాజెక్ట్‌లలోనే విక్రయాలు చేయాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయని, దీంతో గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ప్రణాళికబద్ధమైన విస్తరణ, వ్యాపార పెట్టుబడులతో రానున్న రోజుల్లో ధరలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో అధిక శాతం కొనుగోలుదారులు తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు ఉంటారు. వీరికి నిర్ధిష్టమైన వనరులు, రియల్టీ లావాదేవీలపై అవగాహన కాసింత తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో కొనుగోలుదారులు బిల్డర్ల ప్రొఫైల్‌ను పరిశీలించకుండా తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేస్తుంటారని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రెరా నమోదిత ప్రాజెక్ట్‌లలో కొంటేనే కస్టమర్ల కష్టార్జితానికి పూర్తి విలువ చేకూరుతుందని పేర్కొన్నారు. యూడీఎస్లో కొంటే కొనుగోలు లేదా సమీకరణ చేసిన స్థల విలువకు ప్రామాణికత ఉండదు జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతులు ఉండవు. రెరా అథారిటీ వద్ద నమోదు కాదు. స్థలం అమ్మకం అనధికారిక అగ్రిమెంట్ లేదా జీపీఏ ద్వారా చేస్తారు. రెరా లేదా ఇతర సంస్థల నుంచి కొనుగోలుదారులకు రక్షణ ఉండదు. భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేటు తక్కువే కానీ సురక్షితం ఏమాత్రం కాదు. రెరాలో కొంటే సేకరణ లేదా కొనుగోలులో స్థల విలువకు ప్రామాణికత ఉంటుంది. అన్ని రకాల ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు ఉంటాయి. రెరాలో నమోదు అవుతుంది, రెరా నంబర్ కూడా కేటాయిస్తారు. అమ్మకం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే ఉంటుంది. రెరా అథారిటీలోని పలు నిబంధనలు కస్టమర్లకు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి వివాదాలు తలెత్తినా రెరా అథారిటీ పరిష్కరిస్తుంది. ధర ఎక్కువైనా.. ప్రాపర్టీ మాత్రం సురక్షితం. -
నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేత.. ‘రేరా’ ఎక్కడ విఫలమవుతోంది?
నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని 40 అంతస్తుల ట్విన్ టవర్లను కూల్చేయాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రియాల్టీ రంగానికి పెనుషాక్‌లా తగిలింది. రేరా చట్టం (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ -2016) అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంత తీవ్ర స్థాయిలో కోర్టు తీర్పు వెలువడానికి కారణం ఏంటీ. ఇంత భారీ స్థాయిలో తప్పులు చోటు చేసుకుంటుంటే దాన్ని అరికట్టడంలో రేరా ఎక్కడ విఫలమైంది అనేది ఇప్పుడు రియాల్టీ రంగంలో చర్చకు దారి తీసింది. రేరా సరిపోదా ? దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇతర కోర్టులకు కూడా మార్గదర్శనం కానుంది. ఈ తరహా తీర్పులు మరిన్ని వెలువడితే రియల్టీ రంగంలో ఉన్న వారికి సైతం ఇబ్బంది. రియాల్టీలో ఉన్న ప్రధాన లోపాలు ఏంటీ వీటిని పరిష్కరించాలంటే రేరా లాంటి చట్టాలే సరిపోతాయా? ఈ వ్యాపారంలో ఉన్న వారు, కొనుగోలుదారులు, ఇతర ప్రభుత్వ విభాగాల బాధ్యత ఏంటీ అనే తెర మీదకు వస్తోంది. - రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎవరు ప్రవేశించాలి. అందుకు అర్హతలు ఏముండాలి అనే విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఈ రంగంపై అనుభవం లేకపోయినా తమ బ్లాక్‌మనీని వైట్ చేసుకునేందుకు రియాల్టీ రంగంలోకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. వీరికి ప్రాజెక్టును పూర్తి చేయడం మీద కన్న తమ లాభం, ఇతరత్రా వ్యవహరాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి వారి వెంచర్లను నమ్మినవారు మధ్యలో మునిగిపోతున్నారు. రేరా చట్టంతో ఈ సమస్య సమసిపోతుందనుకున్నారు. అయితే వాస్తవంలో అలా జరగడం లేదు - బిల్డర్‌కి కొనుగోలుదారుడికి మధ్య సమస్య తలెత్తిన సందర్భంలో వాటిని పరిష్కరించడంలో రేరాది ప్రేక్షక పాత్రే అవుతుంది. రేరా చట్టంలో ఉన్న నిబంధనలు లీగల్ ఫైట్ టైమ్‌ని మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఆర్థికంగా బలంగా ఉండే బిల్డర్లతో కొనుగోలుదారులు లీగల్‌గా ఎక్కువ కాలం పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. - సబ్బు బిళ్ల మొదలు బట్టల వరకు ఏదైనా వస్తువును కొనేప్పుడు దాన్ని పరిశీలించి.. బాగుందని నమ్మితేనే కొంటాం. కానీ రియల్ ఎస్టేట్, ఇళ్ల కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. కనీసం నిర్మాణం మొదలుకాకముందే బిల్డర్లు అమ్మకాలు మొదలుపెడతారు. వారి ఏజెంట్లు ఆహా ఓహో అని చెబుతారు. ఆలస్యం చేస్తే రేటు పెరుగుతుందని తొందరపెడతారు. మరోవైపు బ్యాంకర్లు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సైతం లోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డబ్బులు చెల్లించినా సకాలంలో ఇళ్లు చేతికి అందక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల రూపాయల సొమ్మును ఈఎంఐ, వడ్డీలుగా అదనంగా చెల్లిస్తున్నారు. ఈ విషయంలో కనీసం ప్రభుత్వ విభాగాలు సైతం చేష్టలుడిగి చూస్తుండి పోతున్నారు. ఇచ్చిన గడువులోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయని బిల్డర్‌కి ఎటువంటి జవాబుదారితనం లేకపోయినా వచ్చిన నష్టమేమీ లేకుండా పోయింది. చదవండి : 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి -
ఆఫర్లతో కస్టమర్లకు వల
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలోనే కాదు డిస్కౌంట్లు, ఆఫర్లు రియల్టీ రంగంలోనూ దూకుడును పెంచేశాయి. రెరా, జీఎస్టీ కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలను తగ్గించిన డెవలపర్లు.. ఇన్వెంటరీని విక్రయించడం మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. దీంతో రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. నో జీఎస్టీ, ఉచిత రిజిస్ట్రేషన్, ఫ్రీ పార్కింగ్, హోమ్ ఫర్నీషింగ్ ఇలా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. డీమోనిటైజేషన్, జీఎస్టీ, రెరా, ఆర్ధిక మందగమనంతో రియల్టీ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎన్బీఎఫ్సీ సంక్షోభంతో ద్రవ్య లభ్యత తగ్గింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను గట్టేక్కించేవి పండగ సీజన్లే. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ ఎండీ శివ కృష్ణన్ తెలిపారు. పండుగ సీజన్స్‌లో కొత్త వాహనాలకే కాదు గృహ కొనుగోళ్లు, ప్రవేశాలకూ శుభ ముహూర్తాలే. డిస్కౌంట్స్ గృహ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రధాన ఆస్త్రం నగదు రాయితీ. చ.అ. లెక్కన క్యాష్ డిస్కౌంట్ చేస్తుంటారు. ఉదాహరణకు బ్రోచర్లో చ.అ.కు రూ.4 వేలుంటే.. క్యాష్ డిస్కౌంట్ కింద చ.అ.కు రూ.200లు తగ్గిస్తారు. అంటే 1,000 చ.అ. ఫ్లాట్‌కు క్యాష్ డిస్కౌంట్ రూ.2 లక్షలొస్తుందన్నమాట. ఉత్పత్తులు ఆఫర్స్ ప్రతి ఫ్లాట్ బుకింగ్ మీద ఇంటికి అవసరమైన ఉత్పత్తులను ఉచితంగా అందిస్తుంటారు. ఎయిర్ కండీషర్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మాడ్యులర్ కిచెన్స్, హోమ్ ఫర్నిషింగ్, గృహోపకరణాలు లేదా టెలివిజన్, ఐఫోన్ వంటి ఉత్పత్తులు లేదా విదేశీ ట్రిప్, బంగారు నాణేలు, ఉచిత క్లబ్ మెంబర్షిప్స్, ఫ్రీ కార్ పార్కింగ్ వంటివి కూడా అందిస్తుంటారు. ఒకవేళ మీకు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నీషింగ్ వంటి ఆఫర్లు వద్దనుకుంటే వాటి బదులుగా నగదు రాయితీ ఇవ్వమని డెవలపర్లను అడొగొచ్చు. ఉదాహరణకు డెవలపర్ 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో రెండు గదులకు ఏసీలను ఆఫర్ చేస్తున్నాడనుకుందాం. వీటి బదులుగా రూ. లక్ష నగదు రాయితీ తీసుకోవచ్చు. నో రిజిస్ట్రేషన్, జీఎస్టీ చార్జీలు కొంత మంది డెవలపర్లు ఫ్లాట్ బుక్ చేస్తే జీఎస్టీ చార్జీలు తీసుకోమని ఆఫర్ చేస్తుంటారు. ప్రస్తుతం అఫడబుల్ హౌసింగ్లకు 1 శాతం, ఇతర గృహాలకు 5 శాతం జీఎస్టీ ఉంది. కస్టమర్ రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఆయా రాష్ట్రాలను బట్టి స్టాంప్ డ్యూటీ 3 నుంచి 10 శాతం, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.25 లక్షల పైన ఉండే ప్రాపర్టీలకు 1.1 శాతంగా ఉన్నాయి. కొంతమంది డెవలపర్లు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలను కూడా ఆఫర్ చేస్తున్నారు. -
కొత్త రియల్టీ చట్టంతో గృహాలకు డిమాండ్
-
కొత్త రియల్టీ చట్టంతో గృహాలకు డిమాండ్
► కొనుగోలుదారులు మోసపోకుండా రక్షణ ► చిన్న డెవలపర్లకు కష్టకాలమే ► స్వల్ప కాలం పాటు ధరలు స్థిరంగానే ► ఆర్ఈఆర్ఏపై పరిశ్రమ వర్గాలు న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ నియంత్రణ అభివృద్ధి చట్టం – 2016 మే 1 నుంచి (సోమవారం) అమల్లోకి వస్తోంది. ఈ చట్టం (ఆర్ఈఆర్ఏ) రాకతో గృహాలకు డిమాండ్ తిరిగి పుంజుకుంటుందని డెవలపర్లు భావిస్తున్నారు. ఈ చట్టం నిబంధనలను పాటించని అమ్మకందారుల నుంచి కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుందంటున్నారు. విక్రయం కాని యూనిట్లు అధిక సంఖ్యలో ఉన్నందున ధరలు స్థిరంగా కొనసాగొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు సంబంధించి రెండు అత్యున్నత సంస్థలైన క్రెడాయ్, నరెడ్కో నూతన చట్టం దేశీయ రియల్టీ రంగ పనితీరును మార్చేస్తుందని పేర్కొన్నాయి. మొదట్లో చిన్న చిన్న సమస్యలుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులను చట్టం నుంచి మినహాయించాలని కోరినప్పటికీ ప్రభుత్వం వాటికి చోటు కల్పించలేదు. రూపు రేఖలను మార్చేస్తుంది... ‘‘రియల్ ఎస్టేట్ రంగం రూపురేఖలను మార్చేస్తుంది. కొనుగోలుదారులకు రక్షణ కల్పిస్తుంది. గతంలో ఫ్లాట్స్ కొన్నవారికీ ఈ చట్టం రక్షణ కల్పిస్తోంది. ఆర్ఈఆర్ఏ పరిధిలో నియంత్రణ సంస్థ ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయ్యేందుకు ఉన్న మార్గాలను అన్వేషించడం ద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు ఉపశమనం కల్పిస్తుంది’’ అని నరెడ్కో చైర్మన్ రాజీవ్ తల్వార్ పేర్కొన్నారు. పారదర్శకత...: ‘‘ఆర్ఈఆర్ఏ ఈ రంగంలో పారదర్శకతను పెంచుతుంది. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది’’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ జక్సయ్షా అన్నారు. ఈ ఏడాది సరఫరా తగ్గుతుందని, అదే సమయంలో ప్రాపర్టీ మార్కెట్ పట్ల కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరగడం వల్ల డిమాండ్ పుంజుకుంటుందన్నారు. రానున్న ఆరు నెలల్లో 10 శాతం వరకు ధరలు పెరగొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్ వృద్ధికి మార్గం: ‘‘ఈ చట్టం దేశీయ రియల్ ఎస్టేట్‌రంగ భవిష్యత్ వృద్ధికి కీలకం. పారదర్శకతతో ఈ రంగాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఇళ్ల కొనుగోలు దారులు ఊపిరిపీల్చుకుని నమ్మకంగా పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం వచ్చింది. నియమాలు పాటించని చిన్న బిల్డర్లు, పెద్ద వారు సైతం కొనుగోలుదారులను ఇబ్బందులు పెట్టేందుకు అవకాశం ఉండదు’’ అని జేఎల్ఎల్ రెసిడెన్షియల్ సంస్థ చైర్మన్ అనుజ్‌పురి పేర్కొన్నారు. చిన్న డెవలపర్లకు కష్టమే ‘‘అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారు, చిన్న చిన్న డెవలపర్లు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తమ వ్యాపారాలను నిర్వహించడం కష్టతరం అవుతుంది. ఆర్ఈఆర్ఏ రాకతో కొనుగోలు దారులు ప్రాజెక్టులు ఆగే అవకాశం లేని బ్రాండెడ్ ప్రాజెక్టుల వైపు చూస్తారు. ఈ నేపథ్యంలో అవ్యవస్థీకృత నిర్వాహకులు, చిన్న స్థాయి నిర్వాహకులు నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. అయితే, ఇందుకు రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది’’ అని టాటా హౌసింగ్ ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ సేవల హెడ్ రాజీబ్దాస్ పేర్కొన్నారు.