breaking news
Raw one
-
ఆ ఒక్కటీ తప్ప.. ఉల్లితో చాలా ప్రయోజనాలు
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో చాలా ముఖ్యమైంది ఉల్లిపాయ. పసుపు, తెలుపు , ఎరుపు రంగుల్లో ప్రత్యేకమైన ఘాటైన రుచి, వాసనతో లభిస్తుంది. దాదాపు అన్ని కూరల్లో దీన్ని విరివిగా వాడతాం. అయితే పచ్చిగా తీసుకోవడం వల్ల కూడా ఉల్లితో చాలా ఔషధ ప్రయోజనాలున్నాయి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి అయినా చేయదు’ అన్నట్టు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్య , షుగర్ తదితర సమస్యలకు చక్కటి పరిష్కారం ఉల్లి.ఇందులో క్రోమియం షుగర్ స్థాయిలనుఅదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుందిపచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి వాటికి సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిదిఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు ముప్పు కూడా తగ్గుతుంది.జీర్ణక్రియలో పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు ఊతమిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ , హేమోరాయిడ్స్ వంటి వివిధ వ్యాధులను నివారిస్తుంది.వాపును తగ్గిస్తుందిక్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ వ్యాధులకు ఉపశమనానికి అందిస్తుంది.ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందిఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాల్షియం శోషణను ప్రోత్సహించి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారిస్తుంది.మెదడు పనితీరును పెంచుతుందిపచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలు మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ , ఏకాగ్రత పెరగడానికి దోహదపడతాయి.కేన్సర్ నివారణలోపచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ , యాంటీఆక్సిడెంట్లు కేన్సర్ నివారణలో సాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ ,అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి.చర్మ ఆరోగ్యానికి కూడా పచ్చి ఉల్లిపాయల్లోని అధికంగా లభించే యాంటీఆక్సిడెంట్లు ,విటమిన్ సీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. ముడతలు, వయసు మచ్చలు , పిగ్మెంటేషన్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన , మెరిసే చర్మాన్ని అందిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందిపచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గడంలో తక్కువ కేలరీలు , అధిక ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అతిగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది.నోట్: ఏదైనా మితంగా తీసుకోవడం ఉత్తమం. అధిక వినియోగం జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తుంది. ప్రధానంగా పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన వస్తుందనిది గమనించాలి. -
ఛమ్మక్ చల్లో అన్నాడు వన్డే జైల్లో ఉన్నాడు!
మగాళ్లూ... మాట జాగ్రత్త భార్యా భర్త ఉదయాన్నే వాకింగ్‌కి వెళ్లి వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు భార్య నీరసంతో తూలిపడింది. ఎక్కడ పడిందీ అంటే ఓ డస్ట్ బిన్ మీద. ఆ డస్ట్‌బిన్ ప్రభుత్వానిది కాదు. ఓ ప్రైవేటు వ్యక్తిది. ‘నా డస్ట్‌బిన్ మీద పడతావా!’ అని ఆ వ్యక్తి గొడవకు దిగాడు. ‘సారీ’ చెప్పింది ఆమె. డస్ట్‌బిన్ వినలేదు. అదే.. డస్ట్‌బిన్ ఓనరు వినలేదు. ‘కళ్లు నెత్తికి ఎక్కితే కాళ్లు తూలక ఏం చేస్తాయి?’ అన్నాడు. భర్తకు కోపం వచ్చింది. తమాయించుకున్నాడు. భార్య ఊరుకోలేదు. ‘తప్పైపోయింది అన్నాం కదా. చాలు, ఇక ఆపు’ అంది. డస్ట్‌బిన్ యజమానీ ఊరుకోలేదు. ‘పోవమ్మా.. ఛమ్మక్ చల్లో’ అన్నాడు. ఇది జరిగింది 2009లో. మహరాష్ట్రలోని థానేలో జరిగింది. అప్పటికింకా ‘రా.వన్’ సినిమా విడుదల కాలేదు. షారుక్ నటించిన ఆ సినిమాలోనే ‘ఛమ్మక్ చల్లో’ సాంగ్ ఉంది. అయితే పాట కన్నా ముందే ‘ఛమ్మక్ చల్లో’ అనే మాట వాడుకలో ఉంది. అది హిందీ మాట. ‘వగలాడి’ అనే అర్థంలో వాడే మాట! డస్ట్‌బిన్ వాలా అనిన ఆ మాటకు ఆ మహిళ మనసు గాయపడింది. భర్తతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కదల్లేదు. ఎఫ్.ఐ.ఆర్. ఫైల్ చెయ్యలేదు. పెట్టీ కేస్ అన్నారు. దాంతో ఆమె కోర్టుకు వెళ్లింది. కోర్టు ఆమె పిటిషన్‌ని స్వీకరించింది! కానీ విచారణకే.. 8 ఏళ్లు పట్టింది. చివరికి వారం క్రితమే అంతిమ తీర్పు వచ్చింది. ఐ.పి.సి. 509 సెక్షను కింద.. డస్ట్‌బిన్ ఓనర్ని దోషిగా నిర్ధా్థరించి అతడికి 1 రూపాయి జరిమానాను, కొన్ని గంటల జైలు శిక్షను విధించింది కోర్టు. స్త్రీలను మాటతో కానీ, చూపుతో కానీ, చర్యతో కానీ లైంగికంగా కించపరచడం, అవమానించడం, తేలిక చేసి మాట్లాడడం వంటి వాటిని ఈ సెక్షన్ నేరాలుగా పరిగణిస్తుంది. మరి ఇంత చిన్న శిక్ష ఏమిటి? చిన్నదే కావచ్చు. కానీ ఆ మహిళ సాధించింది మాత్రం పెద్ద విజయం. ఆమె తన ఆత్మగౌరవాన్ని మాత్రమే కాపాడుకోలేదు. స్త్రీలందరి ఆత్మగౌరవాన్ని కాపాడింది. అలాగే ఇది ఒక వ్యక్తికి మాత్రమే పడిన శిక్ష కాదు. స్త్రీలను గౌరవించని మగజాతి అంతటికీ పడిన శిక్ష.