breaking news
Ravichandra Ashwin Century
-
చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూపర్ సెంచరీ
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తన సొంతమైదానంలో బంగ్లా బౌలర్లను అశ్విన్ ఊచకోత కోశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశూ.. అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.అశ్విన్ తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా దూకుడుగా ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అప్పటివరకు భారత్‌కు చుక్కలు చూపించిన బంగ్లా పేసర్లపై అశ్విన్ ఎదురుదాడికి దిగాడు. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టుస్తున్నాడు.ఈ క్రమంలో కేవలం 108 బంతుల్లోనే తన ఆరో టెస్టు సెంచరీని అశూ అందుకున్నాడు. అశ్విన్ 112 బంతుల్లో 102 పరుగులు చేసి క్రీజులో ఆజేయంగా ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.భారీ స్కోర్ దిశగా భారత్.. తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్‌తో పాటు జడేజా(86) పరుగులతో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. నహిద్ రానా, మెహదీ హసన్ మీరజ్ తలా రెండు వికెట్లు సాధించారు. Hometown Hundred for Ravichandran Ashwin! 💯 👌#INDvBAN #JioCinema #IDFCFirstBankTestSeries pic.twitter.com/i27n47VK1v— JioCinema (@JioCinema) September 19, 2024 -
453 పరుగులకు భారత్ ఆలౌట్
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 453 పరుగులకు ఆలౌటయింది. దీంతో విండీస్‌పై టీమిండియాకు 219 పరుగుల ఆధిక్యం లభించింది. 354/6 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ధోని సేన మరో 99 పరుగులు జత చేసి మిగతా 4 వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ ఆశ్విన్ సెంచరీ సాధించాడు. 159 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది రెండో సెంచరీ. అరంగ్రేటం శతకం బాదిన రోహిత్ శర్మ 177 పరుగులు చేసి అవుటయ్యాడు. మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో లంచ్ విరామానికి ముందే భారత్ ఆలౌటయింది. విండీస్ బౌలర్లలో షిల్లాంగ్ ఫోర్డ్ 6 వికెట్లు నేలకూల్చాడు. పెరుమాల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. బెస్ట్, కొట్రీల్ చెరో వికెట్ తీశారు.