breaking news
rashtrapati election
-
Sakshi Cartoon: ..వరుసబెట్టి గెలుచుకుంటూ వస్తున్నారుగా మేడం!
..వరుసబెట్టి గెలుచుకుంటూ వస్తున్నారుగా మేడం! -
ఎన్డీఏ అభ్యర్థికే మా మద్దతు: టీఆర్ఎస్
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచే అభ్యర్థికే తమ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉండే అధికార ఎన్డీఏ పక్షాన్నే తాముంటామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తమ ముఖ్య కర్తవ్యమని ఆయన తెలిపారు. ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎన్డీఏను సైతం పక్కనబెట్టేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. అయితే, దీనిపై త్వరలోనే పార్టీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు చేస్తున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం జూలై 24వ తేదీతో ముగియనుండటంతో త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక జరిపేందుకు సన్నాహాలు ప్రారంభయ్యాయి. టీఆర్ఎస్కు లోక్‌సభలో 15 మంది సభ్యులున్నారు.