అసెంబ్లీ టైగర్, ఆంధ్రా ఫ్యూచర్
అసెంబ్లీ టైగర్, ఆంధ్రా ఫ్యూచర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీలో ఆయన మైకు ముందు నిలబడితే ప్రభుత్వానికి దడ పుడుతోందని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడులో శనివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలనైతే కూలుస్తారేమో గానీ, ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న ఆయన ప్రతిరూపాన్ని ఏమీ చేయలేరని మండిపడ్డారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
ఈ ప్రాంత రైతుల కోసం మా అన్న.. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎంత పోరాడుతున్నారో మీ అందరికీ తెలుసు
ఆయన అసెంబ్లీలోను, బయట కూడా రైతుల గురించే మాట్లాడతారు
చాలా సందర్భాల్లో రైతుల ప్రయోజనాల కోసం నిరాహార దీక్షలు చేశారు
20 రోజుల్లో లోకేష్ కామెడీ చూసి అలసిపోయాం
గూగుల్‌లో పప్పు అని కొడితే ముద్దపప్పుతో పాటు ఆయన ఫొటో కూడా వస్తోంది
జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియని అసమర్ధ మంత్రిని మన రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దారు
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రి ఎందుకయ్యారంటే తాగునీటి సమస్య సృష్టించడానికే అంటారు
సోషల్ మీడియాలో ఆయన గురించి పెడుతున్నారని రవికిరణ్‌ను రాత్రికి రాత్రి పక్క రాష్ట్రంలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు
తెలుగుదేశం అరాచక పాలన ఎలా ఉందో అందరికీ తెలుస్తుంది
సూర్యుడిని అరచేత్తో ఆపడం ఎంత కష్టమో, మీరు చేసే తప్పులను మీరు చేసే అవినీతిని, అరాచకాలను చూపే సోషల్ మీడియాను ఆపడం కూడా అంతే కష్టం
రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లున్నాయో కూడా తెలియకుండా 200 సీట్లలో గెలుస్తామన్నారు
ఇంత దద్దమ్మ మంత్రిని మన నెత్తిన పెట్టిన చంద్రబాబుకు కూడా బుద్ధి చెప్పాలి
నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈయన మంత్రి అయి కూర్చున్నారు
ఇక చంద్రబాబు కూడా తమకు 16 శాతం ఆదరణ పెరిగిందని చెబుతారు.. ఏవిధంగా పెరిగిందంటే అది చెప్పరు
ఇదే చంద్రబాబు సొంత జిల్లాలో పట్టభద్రులు.. అంటే మేధావులు, యువత, మహిళలు వేసిన ఓట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్ఆర్సీపీ మద్దతిచ్చిన యండవిల్లి శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు.