breaking news
rap attempt
-
మైనర్‌బాలికపై అత్యాచారయత్నం
తంగెడంచ(జూపాడుబంగ్లా): మండలంలోని తంగెడంచ గ్రామానికి చెందిన మైనర్‌బాలికపై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మోడల్ పాఠశాలలో చదువుతున్న బాలిక సెలవులకు ఇంటికి వచ్చింది.ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ అమ్మాయి కేకలు వేయడంతో తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హె డ్‌కానిస్టేబుల్ చెన్నయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బాలికపై అత్యాచారయత్నం
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో ఓ ఆర్ఎంపీ వద్ద ఓ యువకుడు శిక్షణ పొందుతున్నాడు. గురువారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన దివ్యాంగ బాలికను క్లీనిక్‌లో కసువు కొట్టడానికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం బాలిక శుక్రవారం కుటుంబీకులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. క్లీనిక్‌లో జరిగిన సంఘటనపై ఆర్ఎంపీని విలేకరులు ప్రశ్నించగా అలాంటేదేమి జరుగలేదన్నారు. అయితే బాధిత బాలిక మాత్రం తనపై రెండు పర్యాయాలు బలాత్కారానికి పాల్పడ్డాడని విలేకరులకు చెబుతోంది. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్ఐ బాలనరసింహులును వివరణ కోరగా ఇంత వరకు తమ దృష్టికి రాలేదని, బాధితురాలు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.