బాలికపై అత్యాచారయత్నం | rape attempt on girl | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారయత్నం

May 6 2017 12:34 AM | Updated on Sep 5 2017 10:28 AM

ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.

పగిడ్యాల:  ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పడమర ప్రాతకోట గ్రామంలో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.  గ్రామంలో ఓ ఆర్‌ఎంపీ వద్ద ఓ యువకుడు శిక్షణ పొందుతున్నాడు. గురువారం సాయంత్రం ఇదే గ్రామానికి చెందిన దివ్యాంగ బాలికను క్లీనిక్‌లో కసువు కొట్టడానికి పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం బాలిక శుక్రవారం కుటుంబీకులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. క్లీనిక్‌లో జరిగిన సంఘటనపై ఆర్‌ఎంపీని విలేకరులు ప్రశ్నించగా అలాంటేదేమి జరుగలేదన్నారు. అయితే బాధిత బాలిక మాత్రం తనపై రెండు పర్యాయాలు బలాత్కారానికి పాల్పడ్డాడని విలేకరులకు చెబుతోంది. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్‌ఐ బాలనరసింహులును వివరణ కోరగా ఇంత వరకు తమ దృష్టికి రాలేదని,  బాధితురాలు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి బాలికకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement