breaking news
Ranji match Andhra
-
ప్రశాంత్ శతకం
అగర్తలా: ఆంధ్ర టాపార్డర్ బ్యాట్స్‌మెన్ కదంతొక్కడంతో త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర భారీస్కోరుపై కన్నేసింది. గురువారం ఇక్కడ మొదలైన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. టాస్ నెగ్గిన త్రిపుర ఫీల్డింగ్ ఎంచుకోగా... ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (120 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. శ్రీకర్ భరత్ (18) విఫలమవగా... కెప్టెన్ హనుమ విహారి (62 బ్యాటింగ్; 9 ఫోర్లు)తో కలిసి ప్రశాంత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. అర్ధసెంచరీ పూర్తయిన కాసేపటికి విహారి జట్టు స్కోరు 131 పరుగుల వద్ద నిష్క్రమించాడు. తర్వాత ప్రశాంత్‌కు రికీ భుయ్ (49 బ్యాటింగ్; 5 ఫోర్లు) జతయ్యాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. ఆటముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. త్రిపుర బౌలర్లలో మురాసింగ్, గురీందర్ సింగ్ చెరో వికెట్ తీశారు. -
ఓటమి దిశగా ఆంధ్ర
అస్సాంతో రంజీ మ్యాచ్ గువాహటి: అస్సాంతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. శనివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. అయితే అస్సాం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి ఇంకా 59 పరుగులు వెనుకబడి ఉంది. ఆదివారం ఆటకు చివరి రోజు. అంతకుముందు అస్సాం తమ తొలి ఇన్నిం గ్స్‌లో 145 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌట్ అ య్యింది. దీంతో జట్టుకు 175 పరుగుల ఆధిక్యం ల భించింది. పుర్కయస్థ (248 బంతుల్లో 108 నాటౌట్; 14 ఫోర్లు; 3 సిక్సర్లు) అజేయ శతకం సాధించాడు.