breaking news
Ranji champions
-
నీ దూకుడు సాటెవ్వరు!
అనంతపురం కార్పొరేషన్: తండ్రి ప్రోత్సాహానికి తోడు ఆత్మవిశ్వాసం జతకట్టడంతో క్రికెట్లో తనకు ఎదురు లేదని నిరూపిస్తున్నాడు రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామానికి చెందిన మచ్చా రామలింగారెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు మచ్చా దత్తారెడ్డి. క్రీజులో కాసేపు నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించేలా బంతిని అలవోకగా బౌండరీలు దాటిస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పాటు వికెట్ కీపర్‌గానూ ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆంధ్ర క్రికెట్ అకాడమీలో సభ్యుడిగా ఉన్న సమయంలో భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ వద్ద కీపింగ్‌లో మెలకువలు అభ్యసించాడు. ఈ సీజన్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 41 స్టంపింగ్‌లు, క్యాచ్‌లు పట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అండర్ –12, 14, 16, 19, 23 ఇలా అన్ని ఫార్మాట్లలో అంచనాలకు మించి రాణించి, 20 ఏళ్లకే ఆంధ్ర రంజీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అతనిలోని క్రీడాకారుడికి పట్టం కడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల అండర్ –23 ఏపీ జట్టుకు ఎంపిక చేసింది. జిల్లా సీనియర్ క్రికెటర్లలో ఒకరైన తన తండ్రి మచ్చా రామలింగారెడ్డి స్ఫూర్తి,తోనే తాను కూడా క్రికెట్లోకి అడుగు పెట్టానని, తనకు అన్ని విధాలుగా వెన్నంటి ఉంటూ ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మరువలేనని మచ్చా దత్తారెడ్డి అంటున్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన అంతిమ లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొంటున్నాడు. అధిగమించిన మైలు రాళ్లు బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన అండర్ –19, 23 క్రికెట్ మ్యాచ్‌ల్లో మచ్చా దత్తారెడ్డి 1,500 పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా బీసీసీఐ టోరీ్నలో ఈ ఘనత సాధించిన వారిలో దత్తారెడ్డి ప్రథముడు కావడం గమనార్హం. ఆంధ్ర ప్రీమియర్ లీగ్– 4 లో విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్ జట్టులో దత్తారెడ్డి కీలక ఆటగాడిగా ఖ్యాతి దక్కించుకున్నాడు.గత మూడేళ్లలో జాతీయ స్థాయి టోరీ్నల్లో పాల్గొని హర్యానాపై 172 నాటౌట్, మణిపూర్‌పై 105 నాటౌట్‌గా క్రీజ్‌లో నిలిచాడు. అండర్ –23 డెబ్యూట్‌లో గోవా జట్టుపై 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అండర్ –19 కూచ్‌బెహర్ ట్రోఫీ 2021–22 సీజన్లో 250, 2022–23 సీజన్లో 470 పరుగులు చేశాడు. 2022–23 లో జరిగిన అండర్ –19 వినోద్ మన్కడ్ ట్రోఫీలో 150 పరుగులు సాధించాడు. 2023–24 సీజన్లో అండర్ –23 సీకే నాయుడు ట్రోఫీలో 140 పరుగులు సాధించాడు. -
Irani Cup 2022: కెప్టెన్‌గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు
Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కెప్టెన్‌గా విహారి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ సైతం ఇక ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్‌జోన్ జట్టులో భాగమైన ప్రియాంక్ పాంచల్, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్, యశ్ దుల్ తదితరులు రెస్టాఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను సైతం ఈ టీమ్‌కు ఎంపిక చేశారు. కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇరానీ కప్ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్పరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిషోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వస్వల్లా. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో.. -
ఇరానీ ట్రోఫీ: ముంబై 386/3
ముంబై: రంజీ చాంపియన్ ముంబై జట్టు ఇరానీ ట్రోఫీలోనూ దుమ్మురేపే ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఓపెనర్ జై బిస్టా (90 బంతుల్లో 104; 15 ఫోర్లు; 1 సిక్స్) ఫస్ట్‌క్లాస్ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా మరో ఓపెనర్ అఖిల్ హెర్వాడ్కర్ (148 బంతుల్లో 90; 15 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తొలి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్లకు 386 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (125 బంతుల్లో 88 బ్యాటింగ్; 15 ఫోర్లు; 1 సిక్స్), శ్రేయాస్ అయ్యర్ (49 బంతుల్లో 55; 10 ఫోర్లు) రాణించారు. ఆదిత్య తారే (86 బంతుల్లో 38 బ్యాటింగ్; 4 ఫోర్లు), సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.


