breaking news
Rangu Paduddi
-
గ్యాంగ్ వార్
అలీ ప్రధాన పాత్రలో ధన్‌రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య తారాగణంగా ఎస్. శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగుపడుద్ది’. కిషోర్ రాఠి సమర్పణలో మనీషా అర్డ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ– ‘‘మనీషా బ్యానర్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగు పడుద్ది డైలాగ్‌నే ఇప్పుడు టైటిల్‌గా పెట్టి ఇదే బ్యానర్లో సినిమా చేశారు. ‘యమలీల’ చిత్రంలోని ‘చినుకు చినుకు..’ పాటను అప్పారావు, హీరోయిన్ హీనల మధ్య రీ క్రియేట్ చేశారు. శ్యామ్‌ప్రసాద్‌గారి దర్శకత్వంలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘చాలాకాలం తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్‌ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే మా చిత్రకథాంశం. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్యామ్‌ప్రసాద్. ‘‘ఈ సమ్మర్ వెకేషన్‌కు అవుట్ అండ్ అవుట్ కూల్ కామెడీ చిత్రం అవుతుంది’’ అన్నారు మహేశ్. -
రంగుపడుద్ది..?
ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో ‘రంగు పడుద్ది’ అంటూ ఏవీయస్ చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. అప్పట్లో పాపులర్ అయిన ఈ డైలాగ్ ఇప్పటికీ వాడుకలో ఉంది. ఈ పాపులర్ డైలాగ్‌నే టైటిల్‌గా పెట్టి కోన వెంకట్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. రచయితగా స్టార్డమ్ సంపాదించుకున్న కోన ఆ మధ్య ‘రామ్ అండ్ జూలియట్’ అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘రంగు పడుద్ది’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని బోగట్టా. ఇలాంటి టైటిల్స్ రవితేజ వంటి మాస్ హీరోలకు సరిగ్గా నప్పుతాయి. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించనున్నారని వినికిడి.