రంగుపడుద్ది..? | Ravi Teja New Movie With Kona Venkat | Sakshi
Sakshi News home page

రంగుపడుద్ది..?

Sep 22 2014 11:38 PM | Updated on Sep 2 2017 1:48 PM

రంగుపడుద్ది..?

రంగుపడుద్ది..?

ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో ‘రంగు పడుద్ది’ అంటూ ఏవీయస్ చెప్పిన డైలాగ్ గుర్తుకు

 ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రాన్ని గుర్తు చేసుకుంటే, అందులో ‘రంగు పడుద్ది’ అంటూ ఏవీయస్ చెప్పిన డైలాగ్ గుర్తుకు రాక మానదు. అప్పట్లో పాపులర్ అయిన ఈ డైలాగ్ ఇప్పటికీ వాడుకలో ఉంది. ఈ పాపులర్ డైలాగ్‌నే టైటిల్‌గా పెట్టి కోన వెంకట్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. రచయితగా స్టార్‌డమ్ సంపాదించుకున్న కోన ఆ మధ్య ‘రామ్ అండ్ జూలియట్’ అనే లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘రంగు పడుద్ది’ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని బోగట్టా. ఇలాంటి టైటిల్స్ రవితేజ వంటి మాస్ హీరోలకు సరిగ్గా నప్పుతాయి. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటించనున్నారని వినికిడి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement