ఫ్యాన్సీ షాపు దగ్ధం : రూ. 20 లక్షల ఆస్తి నష్టం
కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డులో ఉన్న సిరి ఫ్యాన్సీ షాపులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని షాపు యజమాని రామిరెడ్డిగారి సురేష్‌బాబు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని చెప్పారు.