breaking news
ramchender rao
-
కాళేశ్వరం పునరుద్ధరణలో కాంగ్రెస్ విఫలం.. రాంచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం మూడు బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఆలస్యంతో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ రోజు (ఆదివారం) కాళేశ్వరం ప్రాజెక్టు అంశమై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. NDSA సిఫారసులను సకాలంలో అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం చెందిందని 2024, 2025, 2026లో మూడు పూర్తి వర్కింగ్ సీజన్లు ఉన్నా పునరుద్ధరణ పనులు పూర్తి చేయలేదన్నారు.రాంచందర్ రావు లేఖలో "200 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయింది. NDSA ఇప్పటికే సమగ్ర పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, పునరుద్ధరణ చర్యలు సూచించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వానికేనని, అమలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే NDSA కమిటీపై బాధ్యత నెట్టడం ద్వారా సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారుఅన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తక్కువ నష్టం జరిగిందని, వాటిని ముందే పునరుద్ధరిస్తే ఉత్తర తెలంగాణకు నీరు అందేది. 20–25 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణకు తాగునీరు అందించే అవకాశం కోల్పోయింది." అన్నారు.విజిలెన్స్ కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని, విజిలెన్స్ నివేదికలో సూచించిన వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం హైకోర్టులో సమర్థంగా వాదించలేదు.బీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. CBI విచారణకు కేవలం మూడు బ్యారేజీల అంశానికే పరిమితమైన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారన్నారు. రూ.1.30 లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని.. పంప్ హౌస్‌లు, కాల్వలు, టన్నెల్లు, రిజర్వాయర్లు సహా మొత్తం ప్రాజెక్టుపై CBI విచారణ జరగాలని రాంచందర్ రావు లేఖలో పేర్కొన్నారు. -
24 నుంచి బీపీఈడీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ బీపీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వి.రాంచంద్రం తెలిపారు. ఈ నెల 24, 26, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.


