breaking news
ramansingh
-
"నక్సలిజం అప్పుడు తీవ్రంగా ఉండేది"
గతంలో ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేదని ఆ రాష్ట్ర స్పీకర్ రమణ్ సింగ్ అన్నారు. గత కాంగ్రెస్ పాలకుల విధానాలు సరిగ్గా ఉంటే రాష్ట్రంలో నక్సలిజం ఎప్పుడో అంతమయ్యేదన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గతంలో జరిగిన ఓ సంఘటనను కాంక్లేవ్‌లో పంచుకున్నారు.ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టు పార్టీ అంపశయ్యపై ఉంది. 2026 మార్చి 31 వరకూ దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడం. దాని కనుగుణంగా కేంద్ర బలగాలు నక్సల్స్‌పై దాడులు తీవ్రతరం చేయడం ఆ పార్టీలోని అగ్రనేతలంతా ఎన్కౌంటర్లో మృతి చెందారు. దీనికితోడు భారీ సంఖ్యలో నక్సల్స్ లొంగుబాట్లు జరుగుతుండడంతో మావోయిస్టు పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత స్పీకర్ రమణ్ సింగ్ ఛత్తీస్‌గఢ్ లో ఒకప్పుడు నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉండేదన్నారు. తన లోక్‌సభ నియోజకవర్గంలోని చురియా పట్టణంలో పర్యటించిన ఘటనను పంచుకున్నారు."నేను చురియా పట్టణంలోకి ప్రవేశించగానే కొద్దిదూరంలోని పోలిస్ స్టేషన్ దగ్గర తుపాకుల శబ్ధం వినిపించింది. అది ఏంటి అని ఎమ్మెల్యేను అడిగితే నా రాక సందర్భంగా టపాసులు పేలుస్తున్నారని తెలిపారు. అంతలోనే కొంతమంది ప్రజలు వచ్చి నన్ను అక్కడి నుండి తీసుకెళ్లారు. తర్వాత దాదాపు గంట సేపు వరకూ కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత నేను ఆ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లాను ఎస్సై ఇద్దరు కానిస్టేబుల్స్ నిరంతరాయంగా కాల్పులు జరుపుతూ పోలీస్ స్టేషన్‌ను కాపాడారు. ఆ ఘటనలో ఒక నక్సల్ మృతి చెందాడు". అని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒకప్పుడు పరిస్థితులు అలానే ఉండేవన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సరైన విధానాలు తీసుకొని ఉండి ఉంటే రాష్ట్రంలో నక్సలిజం ఎప్పుడో అంతం అయి ఉండేదని రమణ్ సింగ్ తెలిపారు. -
ఛత్తీస్‌లో మళ్లీ కాషాయ రెపరెపలే!
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాషాయ జెండానే రెపరెపలాడనుందని ఒక ఒపీనియన్ పోల్ తేల్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించనుందని సీఎన్ఎక్స్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఆ ఎన్నికల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 30, అజిత్‌జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్( జోగి), బీఎస్పీ కూటమి 9 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇతరులు ఒక స్థానంలో గెలవొచ్చని పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 42.22%, కాంగ్రెస్‌కు 37.21%, జోగి, మాయావతి కూటమికి 6.38%, ఇతరులకు 14.21% ఓట్లు రావచ్చని సీఎన్ఎక్స్ సర్వేలో వెల్లడైంది. నవంబర్ 12, 20 తేదీల్లో రెండు దశల్లో చత్తీస్ గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 49, కాంగ్రెస్‌కు 39 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో రమణ్‌సింగ్ ప్రజాదరణకు తిరుగులేదని ఈ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 40.71% రమణ్ సింగ్నే మళ్లీ సీఎంగా కోరుకున్నారు. కాంగ్రెస్ నేత భూపేశ్ భాగెల్‌కు 19.2% మద్దతిచ్చారు. అభివృద్ధి, నిరుద్యోగం, పెట్రో ధరలు ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనున్నాయి. -
ఛత్తీస్ సీఎంపై వాజ్‌పేయి మేనకోడలు పోటీ
రాయ్‌పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కరుణా శుక్లాను కాంగ్రెస్ బరిలోకి దించనుంది. రాష్ట్రంలో నవంబర్ 12న మొదటి విడత జరిగే ఎన్నికలకు గాను ఆరుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రత్యర్థిగా రాజ్‌నందన్‌గావ్ నుంచి ఆమె రంగంలోకి దిగనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మాజీ ఎంపీ అయిన కరుణా శుక్లా బీజేపీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదంటూ 2013 ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి, 2014లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ పాలనపై, సీఎం రమణ్‌సింగ్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే 18 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా.. రెండు విడతలకు కలిపి బీజేపీ 78 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో చత్తీస్గడ్ సీఎం రమణ్‌సింగ్, అండమాన్ నికోబార్ గవర్నర్ ఏకే సింగ్, గాయని పి.సుశీల, సినీ నటి కవితతో పాటు పలువురు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో వీరు స్వామిని దర్శించుకున్నారు. అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.


