breaking news
Rally Cancelled
-
కర్నాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్‌కి నో
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్‌లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్ఎస్ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
ఫొని ఎఫెక్ట్ : దీదీ ర్యాలీలు రద్దు
కోల్‌కతా : ప్రచండ తుపాను ఫొని శుక్రవారం ఉదయం ఒడిశా తీరాన్ని తాకడంతో రానున్న 48 గంటల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రద్దు చేసుకున్నారు. బెంగాల్ తీర ప్రాంత జిల్లా మిడ్నపూర్‌లో పరిస్ధితిని క్షుణ్ణంగా పరిశీలించానలి ఆమె అధికారులను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో రానున్న 48 గంటల్లో తన ర్యాలీలను రద్దు చేసకున్నానని, తాము నిత్యం తుపాన్ పరిస్ధితిని పరిశీలిస్తూ తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలంతా సహకరించాలని, రానున్న రెండు రోజులు ప్రభుత్వం అందించే సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా తీర ప్రాంత జిల్లాలు పశ్చిమ మిడ్నపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టూరిస్టులు సముద్రం ముందున్న వసతి గృహాల్లో బస చేయవద్దని, మత్స్యకారులు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని కోరింది. పాఠశాలలు, విద్యాసంస్ధలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక కోల్‌కతాతో పాటు పశ్చిమ మిడ్నపూర్, ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ, హౌరా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది. -
సైక్లోన్ ఎఫెక్ట్: మోదీ, రాహుల్ ర్యాలీలు రద్దు
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై సైక్లోన్ ఓఖి ప్రభావం పడింది. తుపాన్ గుజరాత్ తీరాన్ని తాకడంతో పలు రాజకీయ పార్టీలు సూరత్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రచార సభలను రద్దు చేశాయి. సూరత్‌లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని రద్దు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే ధన్‌దుక, దహోద్, నేత్రంగ్‌లలో ర్యాలీలు యథావిథిగా జరుగుతాయని స్పష్టం చేశాయి. ఇక బీజేపీ చీఫ్ అమిత్ షా రాజుల, షిహోర్‌లో నిర్వహంచతలపెట్టిన ర్యాలీలు సైతం రద్దయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోర్బి, దర్బంగా, సురేంద్రనగర్ ర్యాలీలు రద్దు చేసినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. తుపాన్ తీరం దాటే క్రమంలో గుజరాత్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని ప్రధాన నదుల్లో వరద ఉధృతి పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
మోదీ పర్యటనకు వరుణుడు అడ్డు
వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ వారణాసి పర్యటన భారీ వర్షం కారణంగా రెండవసారి కూడా రద్దయింది. ఉత్తర ప్రదేశ్‌లోని టెంపుల్ టౌన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో రెండవసారి కూడా ప్రధాని పర్యటన రద్దు చేయక తప్పనిస్థితి. గురువారం తన నియోజకవర్గంలో ఒక రోజు పర్యటన కోసం ప్రధాని బయలుదేరాల్సి ఉంది. అనంతరం వారణాసిలో భారీ ర్యాలీ, బహిరంగ సభలో మోదీ ప్రసంగించాల్సి ఉంది. దీంతో పాటు కొన్ని సంక్షేమ పథకాలను మోదీ ప్రకటించాల్సి ఉంది. మోదీ పర్యటన రద్దు కావడంతో ఇంటిగ్రెటేడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌తో పాటు వారణాసి - బాబత్‌పూర్ మధ్య నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన, బనారస్ హిందూ యూనివర్సిటీలో ట్రౌమా సెంటర్ ప్రారంభం తదితర కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గంలోని ప్రజలను పలకరించేందుకు ప్రయత్నించిన రెండవసారి కూడా ప్రధానికి వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఆయన పర్యటన కోసం రాత్రి పగలు శ్రమించిన బీజేపీ శ్రేణులు ఉసూరుమన్నాయి. జూన్28న భారీ వర్షాల కారణంగా మోదీ వారణాసి పర్యటన రద్దయిన సంగతి విదితమే.


