దీపావళికి.. ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్
ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్' పాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పాస్‌ను ఇష్టమైనవారికి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ దీపావళికి మీ ప్రియమైన వారికి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు మరియు జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలో ఏడాది పొడవునా ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.గిఫ్ట్‌గా ఎలా ఇవ్వాలి?రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఈ యాప్‌లోని 'యాడ్ పాస్' ఆప్షన్ మీద క్లిక్ చేసి, వినియోగదారుడు ఎవరికైతే గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారో.. వారి వెనికల్ నంబర్ & ఇతర వివరాలను ఫిల్ చేసిన తరువాత.. ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయవద్దు. ఇలా చేసిన తరువాత యాన్యువల్ పాస్ యాక్టివేట్ అవుతుంది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్‌కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. కాగా దీనిని ప్రారంభించిన రెండు నెలల్లోనే దాదాపు 5.67 కోట్ల లావాదేవీలతో.. 25 లక్షల మంది వినియోగదారుల మైలురాయిని దాటింది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాజాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.This Diwali, gift your loved ones #FASTagbasedAnnualPass — a thoughtful gesture ensuring seamless travel and hassle-free toll payments all year round.Read more: https://t.co/WULEWyNDMG Let’s make every journey bright and safe. ✨#NHAI #FASTag #Diwali2025 pic.twitter.com/1dyiHPVj7B— NHAI (@NHAI_Official) October 18, 2025