breaking news
rajini political entry
-
రజనీకాంత్‌పై కమల్‌హాసన్ సెటైర్లు
-
రజనీకాంత్‌పై కమల్‌హాసన్ సెటైర్లు
చెన్నై : దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆయన సహ నటుడు కమల్‌హాసన్ సెటైర్లు వేశారు. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్ కనబడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌కు కెమెరాలు కనబడితే హడావుడి చేయడం అలవాటే అంటూ, అందుకే ఇలా హడావుడి చేస్తున్నారంటూ కమల్ వ్యాఖ్యానించారు. తాను సామాజిక కోణంలోనే టీవీ షో చేస్తున్నట్లు కమల్ తెలిపారు. ప్రజలతో మమేకం అయ్యేందుకే తాను టీవీ షో చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ ఇటీవల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అభిమానులను జిల్లాలవారీగా విభజించి వారితో సమావేశమై వారితో కలిసి ఫోటోలు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రాజకీయ రంగప్రవేశం ఖరారు అయిందంటూ ఊహాగానాలు చక్కెర్లు కొట్టాయి కూడా. అంతేకాకుండా రజనీ పొలిటికల్ ఎంట్రీపై దుమారం కూడా మొదలైంది. తాజాగా కమల్ హాసన్...రజనీపై ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేగుతోంది. కాగా తాను తమిళుడినేనంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన బలమైన సంకేతాలు ఇవ్వడంతో తమిళ సంఘాలు భగ్గుమంటున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొదని నినదిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమిళ సంఘాలు, తమిళ భాషా, సాంస్కృతికవాదులు ప్రధానంగా రజనీకాంత్ స్థానికత అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.