breaking news
raids in 5 states
-
Lok Sabha Election 2024: 1100 కోట్లు సీజ్ చేసిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు-2024 షెడ్యూల్లో భాగంగా రేపు చివరి దశలో పోలింగ్ జరుగనుంది. నిన్నటితో ప్రచారానిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్ అయ్యింది.వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల నగదును సీజ్ చేశారు. మే 30వ తేదీ వరకు ఆదాయపన్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గత లోక్సభ ఎన్నికల వేళ 390 కోట్ల నగదును సీజ్ చేశారు.ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, తనిఖీలను పెంచేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డబ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు పైగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వరకు నగదును సీజ్ చేశారు. ఇక, తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు. -
చిట్ఫండ్ స్కాంపై ఐదు రాష్ట్రాల్లో సోదాలు
న్యూఢిల్లీ: విశాఖజిల్లాకు చెందిన ఓ చిట్ఫండ్ సంస్థ అధినేత ఆస్తులపై సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించిన 82 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంట్లో దాదాపు రూ.50 లక్షల నగదును, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో రూ.16.80 లక్షల నగదును స్వాధీనం చేసకున్నట్లు వారు వెల్లడించారు. జార్ఖండ్, బిహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఇళ్లు, కార్యాలయాలు, ఎస్టేట్స్, ఇతర ఆస్తులపై ఆరోపణలు రావడంతో తాము సోదాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది భారీ చిట్ ఫండ్ కుంభకోణమని, ఇందుకు సంబంధించి రెండు కేసులు కూడా నమోదైనట్లు వివరించారు.