చిట్‌ఫండ్ స్కాంపై ఐదు రాష్ట్రాల్లో సోదాలు | CBI searches 82 locations in chit fund scam case | Sakshi
Sakshi News home page

చిట్‌ఫండ్ స్కాంపై ఐదు రాష్ట్రాల్లో సోదాలు

Mar 17 2016 11:54 AM | Updated on Sep 3 2017 7:59 PM

విశాఖజిల్లాకు చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థ అధినేత ఆస్తులపై సీబీఐ తనిఖీలు నిర్వహించింది.

న్యూఢిల్లీ: విశాఖజిల్లాకు చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థ అధినేత ఆస్తులపై సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించిన 82 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంట్లో దాదాపు రూ.50 లక్షల నగదును, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో రూ.16.80 లక్షల నగదును స్వాధీనం చేసకున్నట్లు వారు వెల్లడించారు.

జార్ఖండ్, బిహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఇళ్లు, కార్యాలయాలు, ఎస్టేట్స్, ఇతర ఆస్తులపై ఆరోపణలు రావడంతో తాము సోదాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది భారీ చిట్ ఫండ్ కుంభకోణమని, ఇందుకు సంబంధించి రెండు కేసులు కూడా నమోదైనట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement