breaking news
Rahul Mamkootathil
-
రాహుల్ పై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు
-
నటి ఆరోపణలు.. ఎమ్మెల్యే రాహుల్‌కు బిగ్ షాక్
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌కు బిగ్ షాక్ తగిలింది. రాహుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అంతకుముందు.. రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకరి తర్వాత ఒకరు రాహుల్ బాధితులమంటూ మీడియా ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్కూటథిల్ రాజీనామా చేశాడు. తనను హోటల్ రూమ్‌కు రావాలని రాహుల్ వేధింపులకు గురిచేసినట్టు నటి రిని ఆరోపించారు.తర్వాత హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. తనను అత్యాచారం చేస్తానంటూ రాహుల్ మమ్కూటథిల్ మెసేజ్‌లు పంపాడంటూ ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది. ‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్‌లు చేస్తానన్నోడిని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని అవంతిక ప్రశ్నించింది. రాహుల్‌తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్‌ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది. దీంతో, ఇటు మహిళల ఆరోపణలు, పార్టీ నుంచి, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాజాగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
మరిన్ని చిక్కుల్లో కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే!
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణల ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు బాధితులమంటూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా.. హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు.తనను అత్యాచారం చేస్తానంటూ పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ మెసేజ్‌లు పంపాడంటూ ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ అవంతిక ఆరోపిస్తోంది. ‘‘త్రిక్కకర ఉప ఎన్నిక సమయంలో ఓ మీడియా డిబేట్ జరుగుతుండగా రాహుల్‌ను కలిశాను. ఆ తర్వాత అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఆపై అతను రాత్రింబవళు తెగ ఫోన్ చేసేవాడు. ఆ సమయంలో రాజకీయాలే ఎక్కువగా మాట్లాడేవాడు.అయితే పోను పోను అతని ప్రవర్తలో మార్పు వచ్చింది. అసభ్యమైన సందేశాలు పంపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను రేప్ చేయాలని ఉందంటూ మెసేజ్‌లు పెట్టాడు. భయంతో కాంగ్రెస్ నేతలకు నేను ఫిర్యాదుచేశా. కానీ, అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆఖరికి నన్ను కూడా వదలకుండా.. రేప్‌లు చేస్తానన్నోడిని రోల్ మోడల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి ఉందా? అని అవంతిక ప్రశ్నించింది. రాహుల్‌తో జరిగినట్లుగా చెబుతున్న చాటింగ్‌ను ఆమె మీడియా ముందు ప్రదర్శించింది.రాహుల్ మమ్కూటథిల్పై మలయాళ నటి రిని ఆన్ జార్జ్, రచయిత్రి హనీ భాస్కరన్ ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేగింది. అధికార, ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ మమ్కూటథిల్ గురువారమే రాజీనామా చేశాడు. అయితే.. ఈ ఆరోపణల్లో ఇప్పటివరకు ఎవరూ అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని శపథం చేశాడు. -
‘ఏ తప్పూ చేయకున్నా.. రాజీనామా చేస్తున్నా’
కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) రాజీనామా చేశారు. ఆయనపై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నాం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే..రాజీనామా చేయాలంటూ ఏఐసీసీ నుంచి ఒత్తిళ్లు వస్తునన్నట్లు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. కానీ, తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని ఆయన చెబుతున్నారు. ‘‘దేశ రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా నేను ఇప్పటిదాకా ఎలాంటి తప్పు చేయలేదు. నా మీద ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. నా రాజీనామా ఎవరూ కోరలేదు. అయినప్పటికీ నా పదవికి నేను రాజీనామా చేస్తున్నా. ఏ తప్పు చేయకపోయినా నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలేనని నిరూపించేందుకు ఈ రాజీనామా. నాకు మద్దతుగా నిలవడం కాంగ్రెస్ కార్యకర్తల పని కాదు. వాళ్లను ఆ పని చేయమని నేను కోరే రకమూ కాదు. నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకుంటా. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం నాతో సహా ప్రతీ ఒక్కరి బాధ్యత’’ అని ఆదూర్ నివాసంలో మీడియా ప్రతినిధులకు ఆయన తెలిపారు.మలయాళ నటి రిని ఆన్ జార్జ్ సంచలన ఆరోపణలతో ఇవాళ కేరళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఓ యువ ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యంగా తనకు సందేశాలు పంపించాడని, హోటల్‌కు రమ్మంటూ ఒత్తిడి చేశాడని, ఈ వ్యవహారంపై అతని పార్టీకి ఫిర్యాదు చేస్తానని చెబితే చేసుకోమని సమాధానామిచ్చాడని తెలిపింది. తనలాగే చాలామంది బాధితులు ఉన్నారంటూ ఆమె మీడియాకు తెలిపింది. ఈ క్రమంలో.. రాహుల్ మమ్కూటథిల్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే ఆమె తనకు మంచి స్నేహితురాలని, తన పేరేం చెప్పలేదు కదా అని అంటూనే.. బహుశా వేరేవరో ఆమెను వేధించి ఉంటారని మీడియాతో అన్నాడు. ఈలోపే.. మలయాళీ రైటర్ హనీ భాస్కరన్ ఏకంగా రాహుల్ మమ్కూటథిల్ పేరుతో ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. దీంతో దుమారం రేగింది. అధికార సీపీఐ(ఎం) కూటమి ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో వ్యవహారం హైకమాండ్‌కు చేరడంతో.. రాహుల్ మమ్కూటథిల్ను రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ కోరినట్లు అక్కడి మీడియా చానెల్స్‌లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.చిన్నవయసులోనే పలు వ్యాపారాల్లో రాణించిన రాహుల్ మమ్కూటథిల్.. 2006లో కేరళ స్టూడెంట్స్ యూనియన్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. జిల్లా అధ్యక్షుడు, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించాడు. కిందటి ఏడాది పాలక్కడ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.