breaking news
Rabi season Farmers
-
ధాన్యం.. దైన్యం..
బూర్గంపాడు: రబీ ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో నిరీక్షిస్తున్నారు. రబీ పంట చేతికంది 20 రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించనే లేదు. మార్కెట్‌కు, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్న రైతులకు రోజుల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. గత వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్లో సుమారు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం పంటల సాగుకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పంట దిగుబడి పెరిగింది. గత ఇరవై రోజులుగా జిల్లా వ్యాప్తంగా వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. రైతులు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టి విక్రయానికి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవటంతో తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సరైన వసతులు లేక ఇక్కట్లు.. పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలలో చాలా ప్రాంతాలలో రబీ వరికోతలు ప్రారంభమయ్యాయి. ఒక్క బూర్గంపాడు మార్కెట్ యార్డులోనే సుమారు 70 లారీల ధాన్యం అమ్మకానికి వచ్చింది. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆరు రోజుల క్రితం ప్రారంభించారు. అయితే జియో ట్యాంగింగ్ ప్రక్రియ పూర్తికాలేదని ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇరవై రోజులుగా ధాన్యం అమ్మకాలు కాకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సాధ్యమైనంత తొందరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల హడావిడిలో జిల్లా అధికార యంత్రాంగం తలమునకలైంది. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులకు కూడా ఎన్నికల విధులు కేటాయించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినందున ఇకనైనా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 20 రోజులైనా కొనుగోళ్లు లేవు మార్కెట్‌యార్డుకు వడ్లు తీసుకొచ్చి 20 రోజులైంది. ఎప్పుడు కొంటారో తెలియటం లేదు. రేయింబవళ్లు యార్డులో కాపలా కాస్తున్నాం. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ధాన్యం పాడవుతుందేమోనని భయమేస్తోంది. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. – కైపు చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, రెడ్డిపాలెం అడిగేవారే లేరు యాసంగి వడ్లు అడిగే వారే లేరు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మొదలు కాలేదు. పది రోజులు నుంచి వడ్ల అమ్మకాలకు ఎదురుచూస్తున్నాం. అధికారులు కొనుగోలు కేంద్రం ప్రారంభించి నాలుగు రోజులైన ఇప్పటి వరకు కేజీ వడ్లు కొనలేదు. – పేరం రామాంజిరెడ్డి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు ఈ రబీలో సుమారు 30 వేల టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఎన్నికల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం కొంత ఆలస్యమైంది. ఒకట్రెండురోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. పీఏసీఎస్, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తాం. – లక్ష్మణరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
రైతులు, రుణగ్రహీతలకు ఊరట
-
రైతులు, రుణగ్రహీతలకు ఊరట
విత్తనాల కొనుగోలుకు పాత 500 నోటు వాడొచ్చు - పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు మరో 15 రోజులు గడువు - గృహ, కారు, పంట రుణాల చెల్లింపునకు 60 రోజుల అదనపు గడువు - ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలకు రూ. 50 వేల విత్‌డ్రా పరిమితి న్యూఢిల్లీ/ముంబై: పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల్ని సోమవారం కేంద్రం కరుణించింది. రబీ సీజన్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా విత్తనాల కొనుగోలుకు పాత రూ. 500 నోట్లు వాడుకోవచ్చంటూ సడలింపునిచ్చింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విత్తన విక్రయ కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ నియంత్రణలోని సంస్థలు, జాతీయ, రాష్ట్ర విత్తన కార్పొరేషన్లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్)లో తగిన ఆధారాలు చూపి పాత నోట్లు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయొచ్చని ఆర్థిక శాఖ తెలిపింది. ఎరువులకు పాతవి అనుమతించాలి: రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును మరో 15రోజులు పొడిగించింది. రబీ సీజన్లో రైతులకు తగిన వసతులు కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఏపీఎంసీ(వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ)లో నమోదైన వర్తకులు వారానికి రూ. 50 వేల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. అరుుతే ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు కూడా పాత నోట్లను వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. రబీ సీజన్ వేళ నగదు కొరతతో ఇబ్బందిపడుతున్నామని, తక్షణం నిర్ణయం ప్రకటించాలంటూ ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో పాల్గొన్న రైతులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రుణ వారుుదాలకు వెసులుబాటు: నోట్ల రద్దు కారణంగా రుణ బకారుుల వారుుదా చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఆర్బీఐ శుభవార్త ప్రకటించింది. గృహ, వాహన, వ్యవసాయ.. తదితర రుణాల వారుుదా చెల్లింపు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఉన్నవారికి.. వారుుదా చెల్లింపుల్లో అదనంగా 60 రోజుల వెసులుబాటు కల్పిస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. కోటి రూపాయల లోపు రుణం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అన్ని బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్(ఎన్బీఎఫ్సీ), ఎమ్ఎఫ్ఐ(మైక్రో ఫైనాన్స ఇనిస్టిట్యూషన్స)లో తీసుకున్న రుణాల వారుుదాలు ఈ వెసులుబాటు పరిధిలోకి వస్తారుు. టెర్మ్ లోన్స(నిర్ణీత కాలవ్యవధి రుణాలు) ఏవైనా సరే మొత్తం మంజూరైన మొత్తం రూ. కోటి అంతకంటే తక్కువ ఉండాలి. 60 రోజుల అనంతరం రుణ వారుుదా చెల్లిస్తే ఎలాంటి పెనాల్టీ విధించకూడదు. వ్యక్తిగత ఓవర్‌డ్రాఫ్ట్‌కు వర్తించని 50 వేల విత్‌డ్రా నగదు విత్‌డ్రాకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ తాజాగా మరికొన్ని సడలింపులు చేసింది. ఓవర్‌డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులు వారంలో రూ. 50 వేల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. గతవారం రూ. 50 వేల వరకూ కరెంట్ ఖాతాదారులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సదుపాయం ఓవర్‌డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలకు కూడా వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఈ మొత్తాలకు రూ. 2 వేల నోట్లు మాత్రమే ఇవ్వొచ్చని పేర్కొంది. పనిచేయని ఏటీఎంలు సోమవారం బ్యాంకుల వద్ద రద్దీ తగ్గినా... ఏటీఎంల వద్ద మాత్రం క్యూలు కొనసాగారుు. బ్యాంకుల్లో కూడా నగదు అరుుపోవడంతో చాలామంది నిరాశగా వెనుదిరిగారు. బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేల విత్‌డ్రా పరిమి తి ఉన్నా... డబ్బుల్లేవంటూ తక్కువ మొత్తాలే ఇచ్చా రు. ఏటీఎంలు పనిచేయకపోవడం, నగదు వెంటనే అరుుపోవడంతో చాలా చోట్ల ప్రజలు సిబ్బందితో గొడవపడ్డారు. సగానికి పైగా ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులే కనిపించాయి. రూ. 10 వేల అడ్వాన్సలు తీసుకున్న ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ గ్రూప్- సీ ఉద్యోగులు నవంబర్ నెల జీతంలో రూ. 10 వేలను అడ్వాన్సగా తీసుకోవచ్చనే నిర్ణయం మాత్రం సోమవారమే అమలైంది. హోం శాఖలో పనిచేసే దాదాపు వెరుు్య మంది ఉద్యోగులు రూ. 10 వేల నగదు అడ్వాన్స తీసుకున్నారు. అన్ని మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ముందస్తు జీతం తీసుకుంటున్నారని ఓఉన్నతాధికారి తెలిపారు. పీఓఎస్ల్లో రూపే కార్డులు వాడుకోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న పీఓఎస్(పారుుంట్ ఆఫ్ సేల్) మిషన్లలో రూపే డెబిట్ కార్డులు వాడుకోచవ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) స్పష్టం చేసింది. దాదాపు 600కు పైగా బ్యాంకులు రూపే డెబిట్ కార్డుల్ని జారీచేస్తున్నాయని ఆ కార్డుల్ని పీఓఎస్ పారుుంట్లతో పాటు ఆన్లైన్ కొనుగోళ్లకు వాడుకోవచ్చని ఎన్పీసీఐ పేర్కొంది. ఉర్జిత్ రాజీనామా చేయాలి! చెన్నై: నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చిన్న నోట్లను సరైన మొత్తంలో ప్రజలకు అందుబాటులో ఉంచటంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విఫలమయ్యారని అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) విమర్శించింది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ.. ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ప్రధాని, ఆర్థిక మంత్రికి నోట్ల రద్దుపై పూర్తిగా తెలియకపోవచ్చు. బ్యాంకింగ్ రంగాన్ని సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వానికి ఆర్బీఐ గవర్నర్ సలహా ఇచ్చి ఉండాలి’అని ఏఐబీఈఏ సీనియర్ ఉపాధ్యక్షుడు డి. థామస్ ఫ్రాన్కో తెలిపారు. ‘పెళ్లి’ విత్‌డ్రాకు సవాలక్ష ఆంక్షలు పెళ్లిళ్లకు రూ. 2.5 లక్షల విత్‌డ్రాకు సంబంధించి ఆర్బీఐ సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. 1. నవంబర్ 8కి ముందు ఖాతాలో ఉన్న మొత్తం నుంచే నగదు తీసుకోవాలి. 2. డిసెంబర్ 30 అంతకంటే ముందు జరిగే వివాహాలకు మాత్రమే బ్యాంకులు రూ.2.5 లక్షలు చెల్లించాలి.తల్లి లేదా తండ్రి లేదా పెళ్లి చేసుకునే వ్యక్తి... ఎవరో ఒకరి ఖాతా నుంచి మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవాలి. 3. బ్యాంకు ఖాతాలేనివారికి మాత్రమే నగదు ద్వారా చెల్లింపులు జరపాలి. నగదు విత్‌డ్రా చేసుకునే వ్యక్తి ఆ డబ్బును పెళ్లి ఖర్చు కోసం ఎవరెవరికి చెల్లిస్తున్నారో తెలుపుతూ బ్యాంకుకు జాబితా సమర్పించాలి. 4. పెళ్లి ఖర్చు చెల్లించే వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకపోతే వారి నుంచి డిక్లరేషన్ తీసుకుని బ్యాంకుకు ఇవ్వాలి. దేనికోసం ఎంత ఖర్చుపెడుతున్నారో జాబితాలో తప్పకుండా పేర్కొనాలి. 5. పెళ్లి ఖర్చును నగదు రహిత మార్గాలైన చెక్కులు, డ్రాప్టులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ప్రీపెరుుడ్ కార్డులు, మొబైల్ ట్రాన్స ఫర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా జరిగేలా బ్యాంకులు ప్రోత్సహించాలి. 6. విత్‌డ్రాకు చెందిన అన్ని వివరాల్ని సాక్ష్యాల కోసం బ్యాంకులు కచ్చితంగా నమోదు చేయాలి. అవసరమైతే వివరాలు సరిచూసుకునేందుకు ఉన్నతాధికారులకు ఆ వివరాలు సమర్పించాలి. 7. వివాహ ఆహ్వాన పత్రిక, కళ్యాణ మండపం, కేటరింగ్‌కు ముందస్తు అడ్వాన్స రశీదులు జతపరచాలి. పెళ్లిళ్లు జరిగే కుటుంబాలు రూ. 2.5 లక్షల వరకూ విత్ డ్రా చేసుకోవచ్చంటూ గతవారం కేంద్రం ప్రకటించినా... ఆ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. నవంబర్ 10 -18 వరకు.. బ్యాంకుల్లో డిపాజిట్లు, మార్పిడి రూ. 5.44 లక్షల కోట్లు నోట్ల మార్పిడితో మార్చినది రూ.33,006 కోట్లు ప్రస్తుతం బ్యాంకుల్లోని డిపాజిట్లు 5,11,565 కోట్లు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా ప్రజలకు చేరినది రూ. 1,03,316 కోట్లు