breaking news
Raavi Venkateswara rao
-
గుడివాడ: పోలీసులను దర్భాషలాడిన రావి
సాక్షి, కృష్ణా: గుడివాడ టీడీపీ నేతలు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో.. ఆవేశంతో పోలీసుల మీదకు దూసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. సీఐపై బెదిరింపులకు దిగాడు. శుక్రవారం అనుమతులు లేకుండా నెహ్రూ చౌక్ సెంటర్లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాలు నిర్వహించుకున్నారు టీడీపీ నేతలు. ఆ సమయంలో.. అనుమతులు తీసుకోవాలని సీఐ గోవిందరాజులు, వాళ్లకు సూచించారు. ఈ క్రమంలో సీఐ మాట్లాడుతుండగానే.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆవేశంతో ఆయన మీదకు దూసుకెళ్లాడు. అంతేకాదు.. ఏం చేస్తారో చూస్తాం అంటూ పోలీసుల ముందే టపాసులు కాల్చారు వాళ్లంతా. ఇది పద్దతి కాదని సీఐ గోవిందరాజులు, రావిని ప్రశ్నించగా.. మీ సంగతి తేలుస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల గడ్డలూడదీసి కొడతానంటూ దర్భాషలాడాడు రావి వెంకటేశ్వరరావు. -
రివాల్వర్ అప్పగించిన టీడీపీ నేత
-
రివాల్వర్ అప్పగించిన టీడీపీ నేత
గుడివాడ: స్థానిక ఆఫీసర్స్ క్లబ్ సమీపంలో రివాల్వర్‌తో హల్ చేసిన ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు ఎట్టకేలకు తన రివాల్వర్‌ను పోలీసులకు అప్పగించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన రివాల్వర్‌ను సరెండర్ చేశారు. రివాల్వర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినట్లు రావి వెంకటేశ్వరరావు చెబుతుండగా, రెన్యువల్ అయినట్లుగా డీఎస్పీ కార్యాలయం, వన్ టౌన్ పీఎస్‌కు సమాచారం అందలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నిన్న మధ్యాహ్నం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌కు వచ్చిన రావి వెంకటేశ్వరరావు క్లబ్ బయట అటుఇటు తిరుగుతూ.. తన వద్దనున్న రివాల్వర్‌ను బయటకు తీసి చూపారు. అంతేకాకాకుండా ఆ వెంటనే రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పేలుడు శబ్దానికి పరిసర ప్రాంతాలవారు ఏం జరుగుతుందోనన్న భయంతో పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనను నిర్ధారించారు. అయితే అధికార పార్టీ నేత కావడంతో.. షరా మామూలుగానే ఈ ఘటనను దాచిపెట్టేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దీనిపై గుడివాడ వన్‌టౌన్ సీఐ దుర్గారావును ‘సాక్షి’ వివరణ కోరగా తమకు న్యూస్చానళ్లలో చూస్తే తెలిసిందని, ఫిర్యాదులేవీ రాలేదని చెప్పారు. దీనిపై విచారణ జరుపుతామని, రావి వెంకటేశ్వరరావు వద్ద ఉన్న రివాల్వర్‌ను పరిశీలించి సంఘటన జరిగి ఉంటే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆయుధాల చట్టం ఏం చెబుతోందంటే... వ్యక్తిగత లైసెన్స్ ఆయుధం ఉన్నవారు ప్రాణరక్షణకు మినహా మిగిలిన సమయాల్లో తన వద్దనున్న రివాల్వర్‌ను వాడకూడదు. సెక్షన్–6 సీఈ ప్రకారం ఆయుధాన్ని అవసరం లేకుండా వాడితే సంబంధిత వ్యక్తిపై కేసులు నమోదు చేయాలి.