AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం
చాలాపనులను ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చిటికెలో చేసేస్తుంది. అందుకే ఇప్పుడందరూ దీనిపై పడ్డారు. ఏఐతో సెలబ్రిటీల పెళ్లిళ్లు చేస్తున్నారు. వారితో వ్యాపారాలు చేయిస్తున్నారు. ఆఖరికి కొత్త హీరోహీరోయిన్లను సృష్టించి సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ సరేకానీ, ఎప్పుడో రిలీజైన సినిమాను ఏఐను ఉపయోగించి క్లైమాక్స్ మార్చేయడమే చాలామందికి మింగుడుపడలేదు. ఏఐతో క్లైమాక్స్ మార్చేశారుధనుష్, సోనమ్ కపూర్ జంటగా నటించిన చిత్రం రాంఝనా (Raanjhanaa Movie). ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో రిలీజై ఘన విజయం సాధించింది. ఇప్పుడంతా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఆగస్టు 1న ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేశారు. కాకపోతే అందులో ఒరిజినల్ క్లైమాక్స్ లేదు. ఏఐ సాయంతో రూపొందిన క్లైమాక్స్ జత చేశారు. నిజానికి సినిమా చివర్లో హీరో చనిపోతాడు. కానీ ఏఐ సాయంతో ధనుష్‌ను చంపకుండా బతికించి కథ సుఖాంతం చేశారు. ఆత్మను చంపేశారుదీనిపై ధనుష్ (Dhanush) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏఐ క్లైమాక్స్‌తో రీరిలీజ్ అయిన రాంఝన సినిమా చూసి కలత చెందాను. క్లైమాక్స్ మార్చడం వల్ల సినిమా ఆత్మనే కోల్పోయింది. నేను అభ్యంతరం చెప్పినప్పటికీ సంబంధిత పార్టీలు లెక్కచేయకుండా ఏఐ క్లైమాక్స్ ఉపయోగించాయి. ఇది నేను 12 సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా కానే కాదు.ఆందోళన కలిగించే విషయంసినిమాలో కంటెంట్‌ను మార్చడానికి ఏఐను ఉపయోగించడమనేది కళకు, కళాకారులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇది కథ చెప్పే విధానానికి, సినీవారసత్వానికే ప్రమాదకరం. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ లేఖ షేర్ చేశాడు. For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM— Dhanush (@dhanushkraja) August 3, 2025చదవండి: విలన్‌గా నాగార్జున ఎందుకు చేశారంటే.: రజనీకాంత్