breaking news
R C Bhargava
-
ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..
వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడానికి.. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తరువాత ఆల్టో ధర రూ.40000 నుంచి రూ. 50,000 & వ్యాగన్ ఆర్ ధరలు రూ.60,000 నుంచి రూ. 67,000 వరకు తగ్గే అవకాశం ఉందని మారుతి సుజుకి చైర్మన్ 'ఆర్ సీ భార్గవ' పేర్కొన్నారు.కార్లను 18 శాతం జీఎస్టీ స్లాబులో చేర్చడం వల్ల ప్యాసింజర్ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతుంది. వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు అన్నే కూడా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కౌన్సిల్ చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?కౌన్సిల్ నిర్ణయం ఆటోమేకర్ల రవాణా ఖర్చులు.. డీలర్ మార్జిన్లపై ప్రభావం చూపదని పరిగణనలోకి తీసుకుంటే కార్ల ధరలు 9 శాతం తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్ల మార్కెట్ ఈ సంవత్సరం 10 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు భార్గవ తెలిపారు. కాగా రూ. 20 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు 5 శాతం స్లాబులో ఉన్నాయి. -
మారుతీపై సెబీకి ఫండ్స్ ఫిర్యాదు
ముంబై: మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీ వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి. కార్పొరేట్ గవర్నెన్స్, మైనారిటీ వాటాదారుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలను మారుతీ పాటించేలా చూడమంటూ కంపెనీలో వాటాలున్న మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు సెబీని సంప్రదించాయి. సంబంధిత వర్గాల సమాచారంమేరకు 16 మంది ప్రతినిధులతో కూడిన వాటాదారుల బృందం సెబీ చైర్మన్ యూకే సిన్హాకు మెమొరాండంను సమర్పించినట్లు తెలుస్తోంది. మారుతీలో ఈ సంస్థలకు 7% వాటా ఉంది. ఇక ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ 6.93% వాటాను కలిగి ఉంది. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్‌ను సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను 100% వాటాగల సొంత అనుబంధ సంస్థ ద్వారా చేపట్టేందుకు సుజుకీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో భవిష్యత్‌లో మారుతీ తయారీ సంస్థగా కాకుండా కేవలం మార్కెటింగ్‌కే పరిమితమయ్యే అవకాశమున్నదంటూ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. మారుతీ నిర్ణయంపై తమతో కలసి పోరాడాల్సిందిగా ఎల్ఐసీని సైతం ఫండ్స్, ప్రయివేట్ బీమా సంస్థలు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ నెల 15న మారుతీ నిర్వహించనున్న బోర్డు సమావేశం లో ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.