
వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడానికి.. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తరువాత ఆల్టో ధర రూ.40000 నుంచి రూ. 50,000 & వ్యాగన్ ఆర్ ధరలు రూ.60,000 నుంచి రూ. 67,000 వరకు తగ్గే అవకాశం ఉందని మారుతి సుజుకి చైర్మన్ 'ఆర్ సీ భార్గవ' పేర్కొన్నారు.
కార్లను 18 శాతం జీఎస్టీ స్లాబులో చేర్చడం వల్ల ప్యాసింజర్ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతుంది. వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు అన్నే కూడా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కౌన్సిల్ చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?
కౌన్సిల్ నిర్ణయం ఆటోమేకర్ల రవాణా ఖర్చులు.. డీలర్ మార్జిన్లపై ప్రభావం చూపదని పరిగణనలోకి తీసుకుంటే కార్ల ధరలు 9 శాతం తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్ల మార్కెట్ ఈ సంవత్సరం 10 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు భార్గవ తెలిపారు. కాగా రూ. 20 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు 5 శాతం స్లాబులో ఉన్నాయి.