breaking news
R. Balki
-
థ్రిల్ చేస్తారట
‘చీనీకమ్, పా, షమితాబ్, కీ అండ్ కా, ప్యాడ్‌మ్యాన్’ వంటి సినిమాల తర్వాత ఓ థ్రిల్లర్ కథను చెప్పడానికి రెడీ అయ్యారట బాలీవుడ్ దర్శకుడు ఆర్. బాల్కీ. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. ఇదో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని తెలిసింది. ఇప్పటివరకూ బాల్కీ తీసిన సినిమాల కంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుందట. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ను ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట. ఒకే షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. 2018లో వచ్చిన ‘కార్వాన్’తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దుల్కర్. ఆ తర్వాత ‘జోయా ఫ్యాక్టర్’ అనే సినిమా కూడా చేశారు. -
వెరైటీ టైటిల్‌తో కీ అండ్ కా '
కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం ముంబై: బాలీవుడ్లో ఓ చిత్రమైన టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కబోతోంది. జెండర్ సమానత్వాన్ని ప్రబోధించే ఈ మూవీకి వెరైటీగా 'కీ అండ్ కా ' అని పేరుపెట్టారు దర్శకనిర్మాతలు. సినిమా విశేషాలను దర్శకుడు బాల్కీ వెల్లడించారు. హిందీలో భాషలో మనుషులతోపాటూ వస్తువులకు కూడా జెండర్ ఉందన్నారు. కానీ 'కీ అండ్ కా ' సినిమాకు లింవివక్ష లేదని, సినిమా స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రభోదిస్తుందని తెలిపారు. విరుద్ధభావాలు కల అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే కథతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీ 2016 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. భార్యకు అన్నివిధాలా సహకరించే ప్రోగ్రెస్సివ్ భర్త పాత్రలో అర్జున్ కపూర్, జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో కెరియర్ ఓరియెంటెట్ లేడీ పాత్రలో కరీనా కపూర్ నటిస్తున్నారని చెప్పారు. మరోవైపు అర్జున్ కపూర్, కరీనాకపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రధానపాత్రలో కనిపించనున్నారట. ఇంతకుముందు బాల్కి దర్శకత్వంలో చీనీ కం, పా, షమితాబ్ సినిమాల్లో నటించారు బిగ్ బి.