breaking news
Quick service
-
మళ్లీ జొమాటో క్విక్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రెండేళ్ల తదుపరి క్విక్ సర్విసులను తిరిగి ప్రారంభించింది. ఎంపిక చేసిన పట్టణాలలో 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వినియోగదారులకు 2 కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ అందించనుంది. తద్వారా రేసులోకి వచ్చింది. ప్రత్యర్ధి సంస్థ స్విగ్గీ స్నాక్ పేరుతో 15 నిమిషాల్లోనే ఆహారం, పానీయాలు తదితరాలను అందిస్తోంది. -
సబ్వే ఇండియా ఫ్రాంచైజీలపై రిలయన్స్ ఆసక్తి
ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ రిటైల్ తాజాగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు(క్యూఎస్ఆర్) విభాగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా సబ్వే ఇండియా ఫ్రాంచైజీలపై కన్నేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రోసరీ, ఈఫార్మసీ, ఫ్యాషన్ తదితర రంగాలలో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రెస్టారెంట్ల నిర్వాహక సంస్థ సబ్వే ఇంక్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సబ్వే దేశీ ఫ్రాంచైజీల కోసం 20–25 కోట్ల డాలర్లు(రూ. 1,500–1,860 కోట్లవరకూ) వెచ్చించనున్నట్లు సమాచారం. -
సత్వర సేవలు అందిస్తున్నాం : డెప్యూటీ ఈవో
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు వచ్చే భక్తులు వేచి ఉండే సమయం లేకుండా సత్వర సేవలందిస్తున్నట్లు కల్యాణకట్ట డెప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం తిరుమలలోని మీడియా సెంటర్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 590మంది ఉద్యోగులతోపాటు 879మంది కల్యాణకట్ట సేవకులతో కలసి మొత్తం 1469 మంది సిబ్బందితో కలసి తిరుమలలోని ప్రధాన కల్యాణకట్ట, 18 మినీ కల్యాణకట్టల్లో సేవలందిస్తున్నట్టు తెలిపారు. దీంతో భక్తులు వేచి ఉండే సమయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. తిరుమలలోని గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదిరోజులకు గాను 2,52,712 మంది తలనీలాలు సమర్పించగా, ఈ ఏడాది ఆరు రోజుల్లోనే 2,59,312 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించినట్టు వెల్లడించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అయ్యప్పమాల భక్తులు, గోవిందమాల భక్తులు, వైకుంఠ ఏకాదశి, ఆంగ్ల నూతన సంవత్సరాది వంటి ప్రత్యేక సందర్భాలను దృష్టిలో పెట్టుకుని 2015 జనవరి వరకు కల్యాణకట్ట సేవకుల సేవలను వినియోగించుకోనున్నట్ట చెప్పారు. యాత్రికుల వసతికి పెద్దపీట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు టీటీడీ పెద్దపీట వేసిందని రిసెప్షన్ డెప్యూటీ ఈవో ఆర్1 వెంకటయ్య తెలిపారు. తిరుమలలో మీడియా సెంటర్లో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో తిరుమలలోని 6,683 గదుల్లో వసతి కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఆరు రోజుల్లో రూ.1,06,74,660 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఆరు రోజులకు రూ.70,02,040 ఆదాయం వచ్చిందన్నారు. బ్రహ్మోత్సవాల్లో సేవలందించటానికి వచ్చిన పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, సేవకులు, టీటీడీ సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వసతిని కల్పించామన్నారు.