breaking news
Qualitative education
-
ఉత్తమ భోదన అందించాలి
జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి శంకర్పల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు గుణాత్మకమైన విద్యను భోదించాలని జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండకల్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్మించి అదనపు గదులను ఆదివారం ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరు చాలావరకు మార్చుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభోదన బాగుందని పట్టణ ప్రాంతానికి దగ్గరలో బోధన సరిగా లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నిరుటికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది చేరారన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం బోధన జరుగుతుందని, ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించాలని ఆమె సూచించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రధానోపాధ్యాయుడు విద్యాకర్ చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలో తాగునీటి సమస్య ఉందని కొత్తబోరు వేయించి మోటర్ బిగించాలని, పాఠశాలలో 11 కంప్యూటర్లు ఉన్నా శిక్షకుడిని నియమించాలని, వంట గదికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, సర్పంచ్ యాదమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఒగ్గుమల్లేష్ యాదవ్, దండు రాజేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విఠలయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, వాసుదేవ్ కన్నా, విద్యాకమిటీ చైర్మన్ రాజు, నాయకులు గోవింద్‌రెడ్డి, అయిలయ్య, శేరి అనంత్‌రెడ్డి డి.గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యే ప్రభుత్వ ధ్యేయం:కడియం
మారేడ్‌పల్లి(హైదరాబాద్): కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని కస్తూర్బాగాంధీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ ఉన్నత విద్య జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన ‘తెలంగాణ లో ఉన్నత విద్య బలోపేతం- సీబీఎస్ఈ అమలు’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరముందని మంత్రి అన్నారు. విద్యావేత్త హరగోపాల్ మాట్లాడుతూ విద్యకు అధిక నిధులు కేటాయించి అన్ని వర్గాల వారికి ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. -
గుణాత్మక విద్య.. నాణ్యమైన మెనూ
గిరిజన విద్యాలయాల్లో అందివ్వాలని ఐటీడీఏ పీవో ఆదేశం రూ. 250 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన ఆశ్రమాల్లో సరుకులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవాలని హెచ్ఎంలు, ఏటీడబ్ల్యూవోలకు స్పష్టీకరణ పాడేరు: గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో రూ. 250 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ వెల్లడించారు. అక్కడ విద్యార్థులకు గుణాత్మకమైన విద్య, నాణ్యమైన మెను అందించాలని ఆయన ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమాలు, గురుకులాలు, కేజీబీవీ, ప్రభు త్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో వినయ్‌చంద్ మాట్లాడుతూ అదనపు తరగతి భవనా లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాల కల్పనకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి గత విద్యాసంవత్సరంలో రూ. 123 కోట్లతో, ఈ విద్యా సంవత్సరం లో రూ. 127 కోట్లతో మౌలిక సదుపాయాలకు సం బంధించిన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరిం చారు. వాటన్నింటినీ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. పరి శుభ్రత కార్యక్రమాలతో పాటు మొక్కలను విరివిగా పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలన్నారు. పదో తరగతి విద్యార్థులపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. ఏజెన్సీలోని 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, వారంతా ఆశ్రమాలను తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన నిత్యావసర సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెచ్ఎంలు ఆఖరి అరగంటలో రోజువారి పాఠశాలలు, ఆశ్రమ రికార్డులను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఏటీడబ్ల్యూవోలు కూడా ఆశ్రమాలను, పాఠశాలలను తరచుగా తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఆశ్రమ పాఠశాలకూ నిరంతర నీటి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అన్ని యాజమాన్య విద్యాసంస్థల్లోనూ జవహర్ బాలల ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని పీవో ఆదేశించారు. విద్యార్థులకు హెల్త్ రికార్డు నిర్వహించి, వారికి సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందేలా ఏటీడబ్ల్యూవోలంతా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసీ విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ, పారిశుద్ధ్యం, నాణ్యమైన మెను అమలు అంశాల ఆధారంగా ఆశ్రమాలకు గ్రేడింగ్ ఇస్తామని వివరించారు. నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యలను గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కారమవుతాయని పీవో తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ బి.మల్లికార్జునరెడ్డి, ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడు, ఏటీడబ్ల్యూవోలు పాల్గొన్నారు.